Ram charan upasana : మెగా అభిమానులకు శుభవార్త: తండ్రయిన రాంచరణ్.. ఉపాసన డెలివరీ

అపోలో హాస్పిటల్స్ కి నేడు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకొని రామ్ చరణ్ – ఉపాసన కి శుభాకాంక్షలు తెలియచేసారు. అభిమానులు భారీ స్థాయిలో వస్తారనే అంచనాతోనే, అపోలో హాస్పిటల్స్ పాసులను ఏర్పాటు చేసింది.

  • Written By: NARESH
  • Published On:
Ram charan upasana : మెగా అభిమానులకు శుభవార్త: తండ్రయిన రాంచరణ్.. ఉపాసన డెలివరీ

Ram charan Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన కాసేపటి క్రితమే అపోలో హాస్పిటల్స్ లో పండింటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ నుండి ఒక అధికారిక న్యూస్ బులిటెన్ వెలువడింది. ఉపాసన మరియు పాప ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారని చెప్తున్నారు. నిన్న ఉదయం నుండే రామ్ చరణ్ – ఉపాసన రేపే బిడ్డకి జన్మని ఇవ్వబోతున్నారని వార్త వచ్చింది. అప్పటి నుండే అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చెయ్యడం ప్రారంభించారు.

అపోలో హాస్పిటల్స్ కి నేడు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకొని రామ్ చరణ్ – ఉపాసన కి శుభాకాంక్షలు తెలియచేసారు. అభిమానులు భారీ స్థాయిలో వస్తారనే అంచనాతోనే, అపోలో హాస్పిటల్స్ పాసులను ఏర్పాటు చేసింది. ముందుగా నిన్న రాత్రి మగబిడ్డ జన్మించినట్టుగా కొంతమంది ఫేక్ ప్రచారం కొనసాగించారు, కానీ ఫేక్ ప్రచారం అని అతి తక్కువ సమయం లోనే తేలింది.

ఇక రామ్ చరణ్ తండ్రి చిరంజీవి కి ఏ స్థాయి ఆనందం ఉంటుందో ఊహించుకోవచ్చు, టాలీవుడ్ లో అతి తక్కువ మందికి మాత్రమే దొరికే అదృష్టం అయిన పాన్ వరల్డ్ స్టార్ స్టేటస్, మరియు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న రామ్ చరణ్ సంతానం అతి తక్కువ సమయం లోనే జరిగింది. పెళ్ళై సుమారుగా పదేళ్ల నుండి పిల్లలు లేకపోవడం తో రామ్ చరణ్ మరియు ఉపాసన కి సోషల్ మీడియా లో ఎలాంటి తీవ్రమైన ట్రోలింగ్స్ వచ్చాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

స్వేచ్ఛ గా ఎప్పుడు ఇష్టం అయితే అప్పుడు పిల్లల్ని కనేందుకు కూడా వీలు లేనట్టు కొంతమంది నెటిజెన్స్ వ్యవహరించిన తీరు అప్పట్లో అత్యంత హేయంగా అనిపించింది. కానీ ఉపాసన మాత్రం అలాంటి ట్రోల్ల్స్ కి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యింది, ఏమాత్రం సహనం కోల్పోకుండా సమాధానం ఇచ్చేది, అలాంటి పరిస్థితుల నుండి నేడు బిడ్డకి జన్మనివ్వడం, అప్పట్లో విమర్శలు చేసిన వాళ్ళే ఇప్పుడు శుభాకాంక్షలు తెలపడం అన్నీ ఆలా జరిగిపోయాయి.

Read Today's Latest Pratyekam News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు