ప‌దేళ్ళ త‌రువాత ప్రేమికుడిగా రామ్ చరణ్..?

రామ్ చరణ్, జెనీలియా, షాజన్ పదంసీ హీరోహీరోయిన్లుగా వచ్చిన మూవీ ఆరెంజ్. మ్యూజిక‌ల్ గా సెన్సేష‌న్ క్రియేట్ చేసింది కాని క‌మ‌ర్షియ‌ల్ గా మాత్రం అంత‌గా మెప్పించ‌లేక‌పోయింది. దాదాపు ప‌దేళ్ళ త‌రువాత చ‌ర‌ణ్ మ‌రో ప్రేమ‌క‌థా చిత్రంలో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. ‘మ‌ళ్ళీ రావా’, ‘జెర్సీ’ చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి.. చ‌ర‌ణ్ కోసం ఓ ప్రేమ‌క‌థ‌ను సిద్ధం చేశాడ‌ట‌. పంజాబీ అమ్మాయితో ప్రేమ‌లో ప‌డే ఓ తెలుగు కుర్రాడి […]

  • Written By: Raghava
  • Published On:
ప‌దేళ్ళ త‌రువాత ప్రేమికుడిగా రామ్ చరణ్..?

రామ్ చరణ్, జెనీలియా, షాజన్ పదంసీ హీరోహీరోయిన్లుగా వచ్చిన మూవీ ఆరెంజ్. మ్యూజిక‌ల్ గా సెన్సేష‌న్ క్రియేట్ చేసింది కాని క‌మ‌ర్షియ‌ల్ గా మాత్రం అంత‌గా మెప్పించ‌లేక‌పోయింది. దాదాపు ప‌దేళ్ళ త‌రువాత చ‌ర‌ణ్ మ‌రో ప్రేమ‌క‌థా చిత్రంలో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. ‘మ‌ళ్ళీ రావా’, ‘జెర్సీ’ చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి.. చ‌ర‌ణ్ కోసం ఓ ప్రేమ‌క‌థ‌ను సిద్ధం చేశాడ‌ట‌. పంజాబీ అమ్మాయితో ప్రేమ‌లో ప‌డే ఓ తెలుగు కుర్రాడి క‌థ‌గా ఈ సినిమా ఉంటుంద‌ట‌. అంతేకాదు.. చ‌ర‌ణ్ ఏజ్, క్రేజ్, ఇమేజ్ కు త‌గ్గ‌ట్టుగా ఈ స్టోరీని సిద్ధం చేశాడ‌ట గౌత‌మ్. `ఆర్ ఆర్ ఆర్` రిలీజ‌య్యాక చ‌ర‌ణ్ చేయ‌బోయే సినిమాల్లో.. గౌత‌మ్ తిన్న‌నూరి కాంబినేష‌న్ మూవీ కూడా ఉంటుంద‌ని ప్రచారం సాగుతున్న నేప‌థ్యంలో.. ఇప్పుడీ వార్త మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ‘ఆరెంజ్’ తో క‌మ‌ర్షియ‌ల్ హిట్ అందుకోలేక‌పోయిన చర‌ణ్.. ఈ ప్రేమ‌క‌థా చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంటాడేమో చూడాలి.

సంబంధిత వార్తలు