Varun Tej Lavanya Marriage: వరుణ్ తేజ్ పెళ్ళిలో బాబాయ్-అబ్బాయ్… ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఫోటో!
సదరు ఫోటోలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ ఉన్నారు. వీటితో పాటు మరొక ఫోటో నెటిజెన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.

Varun Tej Lavanya Marriage: వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల వివాహం ఇటలీలో ముగిసింది. నవంబర్ 1న రాత్రి 7:18 నిమిషాలకు లావణ్య మెడలో వరుణ్ తేజ్ తాళికట్టాడు. మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరిగాయి. వరుణ్-లావణ్యల వివాహానికి మెగా హీరోలందరూ హాజరయ్యారు. అందుకే ఈ పెళ్లి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. ఇక వరుణ్ పెళ్ళిలో మెగా హీరోల సందడికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మెగా హీరోలందరూ నూతన వధూవరులతో దిగిన ఫోటో హైలెట్ అయ్యింది.
సదరు ఫోటోలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ ఉన్నారు. వీటితో పాటు మరొక ఫోటో నెటిజెన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. బాబాయ్ పవన్ కళ్యాణ్-అబ్బాయ్ రామ్ చరణ్ చిల్లింగ్ మూమెంట్ అది. ఇద్దరూ నడుస్తూ ఏదో మాట్లాడుకుంటూ నవ్వులు చిందిస్తున్నారు. ఆ మూమెంట్ ని కెమెరాలో బంధించారు. ఈ ఫోటో చూసిన మెగా ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.
బాబాయ్ అబ్బాయ్ హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ పెళ్ళికి పవన్ కళ్యాణ్ తన బిజీ షెడ్యూల్స్ పక్కన పెట్టి సతీసమేతంగా హాజరయ్యాడు. ఇక రామ్ చరణ్ భార్య ఉపాసన, కూతురు క్లిన్ కారతో పాటు పెళ్ళిలో పాల్గొన్నారు. పెళ్లి ముగిసిన నేపథ్యంలో మెగా ఫ్యామిలీస్ తిరిగి ఇండియా చేరుకోనున్నాయి. మరో రెండు రోజుల్లో గ్రాండ్ రిసెప్షన్ ఉంది. హైదరాబాద్ లో ప్రముఖులు, సన్నిహితుల కోసం నవంబర్ 5న రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు.
ఈ వేడుకకు సినీ రాజకీయ వర్గాలకు చెందిన పలువురు హాజరుకానున్నారని సమాచారం. దాదాపు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న లావణ్య-వరుణ్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. జూన్ 9న నిశ్చితార్థం జరగ్గా ఇటలీ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. వరుణ్-లావణ్యలకు అభిమానులు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.
