రాంచరణ్ కు దక్కిన ‘డ్రైవింగ్ లైసెన్స్’

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, నిర్మాతగా విజయం సాధిస్తున్నాడు. ఓ వైపు తన సినిమాలను చేస్తూనే మరోవైపు సినిమాలను నిర్మిస్తూ దూసుకుపోతున్నాడు. తాను స్థాపించిన కొణిదల ప్రొడక్షన్లో తండ్రితో కలిసి ఖైదీ-150, సైరా వంటి బ్లాక్ బ్లస్టర్ మూవీని నిర్మించాడు. ఇటీవలే మలయాళం సూపర్ హిట్ మూవీ ‘లూసీఫర్’ రీమేక్ హక్కుల్ని దక్కించుకున్నాడు. తాజాగా మరో మళయాళ మూవీ ‘డ్రైవింగ్ లైసెన్స్’ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రాంచరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్లో బీజీగా ఉన్నాడు. అంతేకాకుండా […]

  • Written By: Neelambaram
  • Published On:
రాంచరణ్ కు దక్కిన ‘డ్రైవింగ్ లైసెన్స్’

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, నిర్మాతగా విజయం సాధిస్తున్నాడు. ఓ వైపు తన సినిమాలను చేస్తూనే మరోవైపు సినిమాలను నిర్మిస్తూ దూసుకుపోతున్నాడు. తాను స్థాపించిన కొణిదల ప్రొడక్షన్లో తండ్రితో కలిసి ఖైదీ-150, సైరా వంటి బ్లాక్ బ్లస్టర్ మూవీని నిర్మించాడు. ఇటీవలే మలయాళం సూపర్ హిట్ మూవీ ‘లూసీఫర్’ రీమేక్ హక్కుల్ని దక్కించుకున్నాడు. తాజాగా మరో మళయాళ మూవీ ‘డ్రైవింగ్ లైసెన్స్’ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

రాంచరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్లో బీజీగా ఉన్నాడు. అంతేకాకుండా కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్-152వ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో రాంచరణ్ తండ్రితో కలిసి నటించనున్నాడు. చిరంజీవి యంగ్ క్యారెక్టర్లో కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది. తాజాగా దక్కించుకున్న ‘లూసీఫర్’ మూవీని కూడా తండ్రి కోసమే దక్కించుకున్నాడు. ఈ మూవీలోనూ చిరంజీవే హీరోగా నటించనున్నాడు. ‘లూసీఫర్’ మూవీని దర్శకుడు సుకుమార్ తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే ‘లూసీఫర్’ కథను తెలుగు నెటివిటీకి అనుగుణంగా మార్పు చేస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.

తాజాగా దక్కించుకున్న ‘డ్రైవింగ్ లైసెన్స్’ మళయాళంలో మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇప్పటివరకు కేవలం మెగాస్టార్ తోనే సినిమాలు చేసిన రాంచరణ్ తాజాగా మరో హీరోతో ‘డ్రైవింగ్ లైసెన్స్’ నిర్మించనున్నాడు. అయితే మెగా కాంపౌండ్ కు చెందిన హీరోతోనే ఈ మూవీని తీయనున్నట్లు ప్రచారం జరగుతుంది. మొత్తం మీద ‘డ్రైవింగ్ లైసెన్స్’ లో నటించే మెగా హీరో ఎవరా? అనే ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ మూవీపై రాంచరణ్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు