కొరటాలపై రాంచరణ్ సీరియస్

చిరంజీవి-152వ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీని ఆగస్టులో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది. శరవేగంగా పూర్తి చేసుకుంటున్న సినిమా షూటింగ్లో కొన్ని సీన్లు లీకవుతుండంపై మెగా పవర్ స్టార్ రాంచరణ్ సీరియస్ అయ్యారు. దర్శకుడు కొరటాల శివకు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ఇక ముందు సినిమాకు సంబంధించిన ఎలాంటి లీకులు జరుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవల చిరంజీవికి సంబంధించి కొన్ని సీన్లు, వీడియోలు సోషల్ మీడియాలో […]

  • Written By: Neelambaram
  • Published On:
కొరటాలపై రాంచరణ్ సీరియస్

చిరంజీవి-152వ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీని ఆగస్టులో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది. శరవేగంగా పూర్తి చేసుకుంటున్న సినిమా షూటింగ్లో కొన్ని సీన్లు లీకవుతుండంపై మెగా పవర్ స్టార్ రాంచరణ్ సీరియస్ అయ్యారు. దర్శకుడు కొరటాల శివకు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ఇక ముందు సినిమాకు సంబంధించిన ఎలాంటి లీకులు జరుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు ప్రచారం జరుగుతుంది.

ఇటీవల చిరంజీవికి సంబంధించి కొన్ని సీన్లు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో చిరంజీవి ఇందులో ప్రజా నాట్య కళాకారుడిగా కన్పిస్తాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో సినిమాకు సంబంధించి కథాంశం ముందే లీకైతే అభిమానుల్లో ఉత్సాహం తగ్గుతుందని నిర్మాత రాంచరణ్ భావిస్తున్నారు. అదేవిధంగా చిత్ర టైటిల్ విషయంలోనూ, రాంచరణ్ ఎంట్రీ విషయంలోనూ పలురకాల గాసిప్స్ చక్కర్లు కోడుతుండటంతో కొరటాల శివపై నిర్మాత రాంచరణ్ ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఈమేరకు సినిమా షూటింగ్లో దర్శకుడు కొరటాల శివ సెట్స్ లో కొన్ని ఆంక్షలు విధించినట్లు సమాచారం. సినిమా షూటింగ్లో పాల్గొనే నటీనటులతోపాటు, టెక్నిషన్లు, ఇతర సిబ్బంది తమ మొబైల్స్, ల్యాప్ టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను లోనికి తీసుకురావద్దని ముందు చెబుతున్నారు. సెట్లోనే ఈ పరికరాలను ఉంచుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెల్సింది. ‘బహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’లకు దర్శకుడు రాజమౌళి షూటింగ్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చిరంజీవి-152 విషయంలోనూ అదే ప్లాన్ చేస్తున్నారని తెల్సింది. అయితే ఎవరెన్నీ చర్యలు చేపట్టినా లీకులు మాత్రం అరికట్టడంలో విఫలమవుతూనే ఉన్నారు. కొరటాల శివ ఏమేరకు లీకులను కట్టడి చేయగలడో వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు