Sharwanand Wedding: శర్వానంద్ పెళ్లికి హాజరైన వన్ అండ్ ఓన్లీ స్టార్ రామ్ చరణ్… కారణం తెలుసా?
రామ్ చరణ్ కి మాత్రమే ఆహ్వానం అందడం వెనుక బలమైన కారణం ఉంది వీరిద్దరూ చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్. రామ్ చరణ్-శర్వానంద్ కలిసి చదువుకున్నారు. మెగా ఫ్యామిలీతో శర్వానంద్ కి విడదీయరాని అనుబంధం ఉంది. శర్వానంద్ ని తమలో ఒకడిగా చిరంజీవి ఫ్యామిలీ చూస్తుంది. అందుకే శర్వానంద్ రామ్ చరణ్ కి పెళ్ళికి ఆహ్వానించాడు. ప్రాణమిత్రుడు వివాహం కావడంతో రామ్ చరణ్ హాజరయ్యారు. శర్వానంద్ పెళ్లిలో రామ్ చరణ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Sharwanand Wedding: హీరో శర్వానంద్ వివాహం రాజస్థాన్ లోని జైపూర్ లీలా ప్యాలస్ లో ఘనంగా జరుగుతుంది. జూన్ 2, 3 తారీఖుల్లో శరానంద్-రక్షిత రెడ్డి మ్యారేజ్ ప్లాన్ చేస్తారు. నిన్న హల్దీ ఫంక్షన్, సంగీత్ నిర్వహించారు. నేడు పెళ్లి జరగనుంది. శర్వానంద్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్న క్రమంలో బంధువులకు మాత్రమే ఆహ్వానం అందింది. అయితే పరిశ్రమ నుండి ఒక్క రామ్ చరణ్ కి మాత్రమే ఆహ్వానం అందినట్లు సమాచారం. దీంతో ప్రాణ మిత్రుడు వివాహానికి రామ్ చరణ్ హాజరయ్యాడు .
రామ్ చరణ్ కి మాత్రమే ఆహ్వానం అందడం వెనుక బలమైన కారణం ఉంది వీరిద్దరూ చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్. రామ్ చరణ్-శర్వానంద్ కలిసి చదువుకున్నారు. మెగా ఫ్యామిలీతో శర్వానంద్ కి విడదీయరాని అనుబంధం ఉంది. శర్వానంద్ ని తమలో ఒకడిగా చిరంజీవి ఫ్యామిలీ చూస్తుంది. అందుకే శర్వానంద్ రామ్ చరణ్ కి పెళ్ళికి ఆహ్వానించాడు. ప్రాణమిత్రుడు వివాహం కావడంతో రామ్ చరణ్ హాజరయ్యారు. శర్వానంద్ పెళ్లిలో రామ్ చరణ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇక శర్వానంద్ పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి రక్షిత రెడ్డి సాఫ్ట్వేర్ ఎంప్లొయ్. ఆమె తండ్రి మధుసూదన్ రెడ్డి హైకోర్టు లాయరు. వీరికి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. రక్షిత రెడ్డి తాత దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాజీ మంత్రి. రక్షితకు పెద్ద బ్యాక్ గ్రౌండే ఉంది. శర్వానంద్ టైర్ టూ హీరో అయినప్పటికీ ఆస్తుల విషయంలో ఎవరూ సరిలేరు. జంట నగరాల్లో శర్వానంద్ కుటుంబానికి వందల కోట్ల ఆస్తులు ఉన్నట్లు సమాచారం.
ఇక శర్వానంద్ కెరీర్ పరిశీలిస్తే… ఆయన చిన్న చిన్న పాత్రలతో ప్రస్థానం మొదలుపెట్టాడు. గమ్యం శర్వానంద్ కి బ్రేక్ ఇచ్చింది. ప్రస్థానం, జర్నీ వంటి చిత్రాలు ఆయనకు గుర్తింపు తెచ్చాయి. రన్ రాజా రన్. శతమానం భవతి, మహానుభావుడు చిత్రాలు శర్వానంద్ కి ఇమేజ్ తెచ్చిపెట్టాయి. ఈ మధ్య శర్వానంద్ సరైన విజయం లేక ఇబ్బందిపడుతున్నారు. ఆయన భారీ కమర్షియల్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది.
#RamCharan at his best friend #sharwanand wedding @alwaysramcharan pic.twitter.com/DENC7Fbhf8
— Telugu Box office (@TCinemaFun) June 2, 2023