RRR Oscor : జనవరి 24 , 2023..ఈ తేదీని సువర్ణాక్షరాలతో మన తెలుగు చలన చిత్ర చరిత్ర పుస్తకం లో లిఖించవచ్చు..ఎందుకంటే ప్రపంచం లోనే అత్యున్నత పురస్కారమైన ఆస్కార్స్ అవార్డ్స్ నామినేషన్స్ లో మన #RRR నుండి ‘నాటు నాటు’ పాటకి ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరిలో నామినేషన్ దక్కింది..మన టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది మహనీయులు ఎన్నో అద్భుతమైన దృశ్యకావ్యాలు మన ముందుకు తీసుకొచ్చారు.
కానీ ఏ హీరో సాధించలేని ఘనత..ఏ లెజండరీ డైరెక్టర్ సాధించలేని ఘనత దర్శక ధీరుడు రాజమౌళి సాధించాడు..తన అద్భుతమైన ప్రతిభ తో #RRR వంటి అద్భుతాన్ని తీసి తెలుగోడినే కాదు..ప్రతీ భారతీయుడిని గర్వించేలా చేసాడు..ఇక ఈ సినిమాలో హీరోలు గా నటించిన రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కి ప్రపంచ నలుమూలల నుండి వస్తున్నా ప్రశంసలు వాళ్ళు పడ్డ కష్టానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు..టాలీవుడ్ ని శాసించే స్థాయి ఉన్న ఈ ఇద్దరు హీరోలు..రాజమౌళి విజన్ ని నమ్మి మూడేళ్ళ విలువైన సమయాన్ని వెచ్చించినందుకు గాను వీళ్ళని ఎంత పొగిడినా తక్కువే అవుతుంది.
నేడు ‘నాటు నాటు’ సాంగ్ కి ఈ రేంజ్ గౌరవం దక్కడానికి ప్రధాన కారణాలలో మొదటి కారణం రామ్ చరణ్ – ఎన్టీఆర్ అద్భుతమైన డ్యాన్స్..కీరవాణి సంగీతం..రాజమౌళి విజన్ మరియు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అద్భుతమైన కొరియోగ్రఫీ..వీటిల్లో ఏది మిస్ అయినా ఈ రేంజ్ రీచ్ ఈ పాటకి వచ్చేది కాదనే చెప్పాలి..నామినేషన్స్ లోకి వచ్చింది కాబట్టి కచ్చితంగా #RRR మూవీ టీం ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ కి వెళ్తుంది.
మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ లో నాటు నాటు సాంగ్ కి రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కలిసి మరోసారి డ్యాన్స్ వెయ్యబోతున్నారట..ఆస్కార్ వేదిక పై ‘నాటు నాటు’ పాటలో వేసుకున్న కాస్ట్యూమ్స్ ని వేసుకొని ఈ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ చెయ్యబోతున్నట్టు సమాచారం..ఆ అరుదైన దృశ్యాన్ని చూడడానికి యావత్తు భారతదేశ సినీ ప్రియులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.