రాజు ఆత్మహత్యకు ముందు తమకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడని నస్కల్ రైల్వే ట్రాక్ మెన్ కుమార్ తెలిపారు. తమను చూసి అతను పొదల్లోకి వెళ్లిపోవడంతో ఎవరో అనుకున్నామన్నారు. తాము కొద్దిదూరం వెళ్లిన తర్వాత 8.40 సమయంలో కోణార్క్ ఎక్స్ ప్రెస్ కింద పడి ఓ వ్యక్తి చనిపోయాడని రైతులు చెప్పినట్లు కుమార్ చెప్పారు. దీంతో తాము రైల్వే సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి రాజుగా నిర్ధారించినట్లు చెప్పారు.