గోపీచంద్ కి వార్నింగ్ ఇవ్వబోతున్న రజనీకాంత్

సామాజిక అంశాలతో , సమస్యలతో సినిమాలు తీసి మంచి పేరు సంపాదించుకొన్నదర్శకుడు  టి. కృష్ణ తనయుడు గోపీచంద్ టాలీవుడ్ లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. మొదట తొలి వలపు చిత్రం తో హీరోగా అడుగుపెట్టి ఆ తరవాత అనూహ్యంగా విలన్ అయ్యాడు. విజయాలు దక్కాయి. మళ్ళీ ఊహించని విధంగా యజ్ఞం సినిమాతో హీరో అయ్యాడు. ఇక అప్పటినుంచి హీరోగానే తన జర్నీ కొనసాగిస్తున్నాడు. కాగా గత కొంతకాలంగా సరైన హిట్ లేక స్ట్రగుల్ అవుతున్నాడు. ప్రస్తుతం […]

  • Written By: Raghava
  • Published On:
గోపీచంద్ కి వార్నింగ్ ఇవ్వబోతున్న రజనీకాంత్

సామాజిక అంశాలతో , సమస్యలతో సినిమాలు తీసి మంచి పేరు సంపాదించుకొన్నదర్శకుడు  టి. కృష్ణ తనయుడు గోపీచంద్ టాలీవుడ్ లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. మొదట తొలి వలపు చిత్రం తో హీరోగా అడుగుపెట్టి ఆ తరవాత అనూహ్యంగా విలన్ అయ్యాడు. విజయాలు దక్కాయి. మళ్ళీ ఊహించని విధంగా యజ్ఞం సినిమాతో హీరో అయ్యాడు. ఇక అప్పటినుంచి హీరోగానే తన జర్నీ కొనసాగిస్తున్నాడు. కాగా గత కొంతకాలంగా సరైన హిట్ లేక స్ట్రగుల్ అవుతున్నాడు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ సినిమా చేస్తున్నాడు. ఆ తరవాత దర్శకుడు తేజ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇపుడు మరో సంచలన వార్త బయటికొచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో గోపీచంద్ విలన్గా నటించ బోతున్నాడన్న న్యూస్ వైరల్ అవుతోంది. గతంలో గోపీచంద్ తో శౌర్యం , శంఖం వంటి హిట్ చిత్రాలు తీసిన శివ ప్రస్తుతం రజనీకాంత్ తో తీస్తున్న అన్నాత్తే చిత్రం లో ప్రతినాయకుడి పాత్ర కోసం గోపీచంద్ ని సంప్రదించినట్టు తెలుస్తోంది. గతంలో తమిళ్ లో కూడా జయం చిత్రం తో విలన్ గా  పరిచయమైన గోపీచంద్ ఇన్నాళ్ల తరవాత మళ్ళీ దుర్మార్గుడిగా నటించేందుకు సిద్దమౌతున్నట్టు తెలుస్తోంది. SOMETHING IS BETTER THAN NOTHING

సంబంధిత వార్తలు