Shah Rukh Khan: రజినీకాంత్ ..విజయ్ ని కాదు అజిత్ ని మిస్ అయ్యా .. షారుక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చాలా రోజుల తర్వాత మళ్లీ చెన్నైకి రావడం మీకు ఎలా అనిపించింది మీకు ఎవరన్నా హీరో హీరోయిన్ ని కలవాలి అని ఉందా అని ఒక అభిమాని అడగగా.. దానికి సమాధానముగా షారుఖ్ ఖాన్ ‘ నేను రజినీకాంత్ సార్ ని కలిసాను. అలానే విజయ్ ని కలిసాను. కానీ అజిత్ ని కలవడం మిస్ అయ్యా. కానీ ఆ పని త్వరగా నే చేస్తా’ అంటూ సమాధానం ఇచ్చారు.

Shah Rukh Khan: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జవాన్’. ఈ వారంలో థియేటర్లలోకి రాబోతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా గురించి మరిన్ని వివరాల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కింగ్ ఖాన్ స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్లో అస్క్ ఎస్ ఆర్ కే అని ఒక థ్రెడ్ రన్ చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఫ్యాన్స్ షారుక్ ని ఏదైనా అడగొచ్చు దానికి ఈ హీరో సమాధానమిస్తారు. ఇందులో భాగంగా ఇప్పుడు ఒక తమిళ సినిమాఅభిమాని అడిగిన ప్రశ్న అలానే షారుక్ చెప్పిన ఆన్సర్ వైరల్ అవుతోంది.
చాలా రోజుల తర్వాత మళ్లీ చెన్నైకి రావడం మీకు ఎలా అనిపించింది మీకు ఎవరన్నా హీరో హీరోయిన్ ని కలవాలి అని ఉందా అని ఒక అభిమాని అడగగా.. దానికి సమాధానముగా షారుఖ్ ఖాన్ ‘ నేను రజినీకాంత్ సార్ ని కలిసాను. అలానే విజయ్ ని కలిసాను. కానీ అజిత్ ని కలవడం మిస్ అయ్యా. కానీ ఆ పని త్వరగా నే చేస్తా’ అంటూ సమాధానం ఇచ్చారు.
అంతేకాదు ఈ హీరో కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు .. ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు. ‘జవాన్’ సినిమా గురించి ఒక్క పదంలో చెప్పమని అడగ్గా.. ”మహిళలు.. ఈ సినిమాను వాళ్ళే నడిపిస్తారు. ఇది మహిళల గొప్పతనాన్ని పురుషులకు తెలియజేసేలా తెరకెక్కిన చిత్రం. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది” అని బదులిచ్చారు. పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ల వరకు అందరూ ఈ సినిమా చూడొచ్చని, అందరినీ అలరించే కంటెంట్ ఇందులో ఉందని చెప్పారు.
ఇప్పటికే ‘జవాన్’ నుంచి వచ్చిన ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలానే రాక్ స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ కంపోజ్ చేసిన ‘రామయ్యా వస్తావయ్యా’
మీ, ‘జిందా బందా’, ‘చెలియా’ సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.