Rajamouli Tweet On Keeravani: గత ఏడాది విడుదలైన #RRR చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టించిందో, డిజిటల్ మీడియాలో విడుదలైన తర్వాత అంతకంటే పదింతలు ఎక్కువ పాపులరిటీ మరియు క్రేజ్ ని దక్కించుకుంది..అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచం నలుమూలల్లో ఉన్న సినీ అభిమానులు కూడా #RRR చిత్రాన్ని ఎగబడి చూసారు..అందువల్ల అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం తో ఈ మూవీ కి అవార్డ్స్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్ లో అదే రేంజ్ లో వచ్చాయి.

Rajamouli Tweet On Keeravani
ముఖ్యంగా ఈ చిత్రానికి సంగీతం అందించిన కీరవాణి కి ఎక్కువ అవార్డ్స్ దక్కుతున్నాయి.. రీసెంట్ గానే ‘నాటు నాటు’ సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న కీరవాణి, అదే క్యాటగిరీ లో ఆస్కార్స్ కి కూడా నామినేట్ అయ్యాడు.
అందుకు దేశం మొత్తం గర్విస్తున్న ఈ నేపథ్యంలో లో భారత దేశ ప్రభుత్వం ఆయనకీ పద్మశ్రీ అవార్డు ని ప్రకటించింది.. ఈ సందర్బంగా కీరవాణి కి శుభాకాంక్షలు తెలుపుతూ రాజమౌళి ట్విట్టర్ లో పెట్టిన ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.. ఆయన మాట్లాడుతూ ‘ కీరవాణి గారికి ఇప్పుడు వస్తున్న గుర్తింపు ఎప్పుడో రావాల్సిందని అందరి అభిమానులు లాగానే నేను కూడా అనుకునేవాడిని..కానీ ఈ విశ్వం ఒకరి కష్టానికి తగిన ఫలితం మనం కోరుకున్నట్టు కాదు.

Rajamouli
సందర్భం వచ్చినప్పుడు ఊహించిన దానికంటే ఎక్కువ గుర్తిస్తుంది..ఇప్పుడు నేను ఆ విశ్వం తో ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను.. కాస్త గ్యాప్ ఇవ్వమ్మా.. ఒక్కటి పూర్తి గా ఎంజాయ్ చేశాకనే మరొకటి ఇవ్వు ‘ అంటూ ట్వీట్ వేసాడు.. ఇది ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.. మరోపక్క కీరవాణి కి పద్మశ్రీ అవార్డు రావడం పై టాలీవుడ్ సెలబ్రిటీస్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. ఇది నిజంగా ఆయన జీవితంలో గోల్డెన్ పీరియడ్ అనే చెప్పొచ్చు.