
Rajamouli Oscar Award Celebrations
Rajamouli Oscar Award Celebrations: #RRR మూవీ కి ఆస్కార్ వచ్చిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతలా సంబరాలు చేసుకుంటున్నారో మన అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఈ సినిమా ప్రతీ ఒక్కరికి అంతలా నచ్చింది.ఈవెంట్ ని ముగించుకొని మూవీ టీం హైదరాబాద్ కి వచ్చినప్పుడు అభిమానులు బేగంపేట్ విమానాశ్రయం కి చేరుకొని ఘన స్వగతం పలికారు. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు.
ఆయన వస్తున్నట్టు అభిమానులకు ఎలాంటి సమాచారం లేదు. తెల్లవారు జామున 3 గంటలకు వచ్చాడు. అయినా కానీ అక్కడకి అశేషం గా అభిమానులు వేలాదిగా తరళి వచ్చి ఎన్టీఆర్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఆ తర్వాత రామ్ చరణ్ వచ్చాడు, ఆయనకీ కూడా అదే రేంజ్ వెల్కమ్ దక్కింది. ఇక రాజమౌళి సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానులు ఆయనకీ గ్రాండ్ వెల్కమ్ చెప్పడం అనేది ఊహించిందే. అలాగే కుటుంబ సభ్యులు కూడా ఆయనకీ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు.
రాజమౌళిది జాయింట్ ఫ్యామిలీ అనే విషయం అందరికీ తెలిసిందే.ఆయన కుటుంబ సభ్యులందరు కలిసి రాజమౌళి కి ఇంటికి రాగానే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. భారీ కేక్ ని తీసుకొచ్చి కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కీరవాణి కుటుంబం , రాజమౌళి కుటుంబం, కార్తికేయ దంపతులు ఇలా ఈ పరివారం మొత్తాన్ని కలిపితే ఎంత ఉందొ మీరే చూడండి ఈ క్రింది వీడియోలో.

Rajamouli Oscar Award Celebrations
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఇక రాజమౌళి తన తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు తో చెయ్యబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చకచకా జరుగుతుంది. ఈ సినిమా ప్రారంభం కి ముందు రాజమౌళి ఒక రెండు నెలల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోబోతున్నాడట. ఆ తర్వాతనే వర్క్ గురించి ఆలోచిస్తాడట.