Rajamouli : మహేష్ సినిమా తర్వాత రాజమౌళి చేయబోయేది ఆ హీరోతోనే!

Rajamouli : ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి రేంజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఇండియా లో ఉన్న ప్రతీ సూపర్ స్టార్ ఆయన తో కలిసి ఒక సినిమా చెయ్యాలని కలలు కంటూ ఉంటారు.ఎందుకంటే ఆయనతో ఒక సినిమా చేస్తే ఎవరి రేంజ్ అయినా ఊహించని స్థాయికి చేరుకోవాల్సిందే.టాలీవుడ్ లో లోకల్ స్టార్స్ గా చలామణి అయినా రామ్ చరణ్ , ఎన్టీఆర్ మరియు ప్రభాస్ వంటి స్టార్స్ ని నేడు గ్లోబల్ స్టార్స్ గా మార్చాడు. ప్రస్తుతం […]

  • Written By: Naresh
  • Published On:
Rajamouli : మహేష్ సినిమా తర్వాత రాజమౌళి చేయబోయేది ఆ హీరోతోనే!

Rajamouli : ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి రేంజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఇండియా లో ఉన్న ప్రతీ సూపర్ స్టార్ ఆయన తో కలిసి ఒక సినిమా చెయ్యాలని కలలు కంటూ ఉంటారు.ఎందుకంటే ఆయనతో ఒక సినిమా చేస్తే ఎవరి రేంజ్ అయినా ఊహించని స్థాయికి చేరుకోవాల్సిందే.టాలీవుడ్ లో లోకల్ స్టార్స్ గా చలామణి అయినా రామ్ చరణ్ , ఎన్టీఆర్ మరియు ప్రభాస్ వంటి స్టార్స్ ని నేడు గ్లోబల్ స్టార్స్ గా మార్చాడు.

ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభం కాబోతుంది.అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేయబోతున్నాడు..? అనే దానిపై గత కొంతకాలం గా సోషల్ మీడియా లో రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.ఆయన కోసం టీ సిరీస్  – జీ స్టూడియోస్ వంటి ప్రముఖ సంస్థలు గత కొంతకాలంగా ఎదురుచూస్తూ ఉన్నాయి.

అంతే కాదు ఒక కన్నడ సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘KVN ప్రొడక్షన్స్’ రాజమౌళి తో ఇటీవలే ఒక అగ్రిమెంట్ కుదరించుకుందట.తమ ప్రొడక్షన్ హౌస్ లో వరుసగా రెండు సినిమాలు చేయాలంటూ భారీ స్థాయిలో అడ్వాన్స్ ని కూడా కేటాయించారట.ఈ ప్రాజెక్ట్స్ లో KGF హీరో యాష్ నటించబోతున్నట్టు తెలుస్తుంది.రీసెంట్ గానే యాష్ ని కలిసి డేట్స్ కూడా సంపాదించారట KVN ప్రొడక్షన్స్.అయితే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడానికి కనీసం 5 ఏళ్ళ సమయం పడుతుంది.

ఎందుకంటే మహేష్ తో తెరకెక్కించబోయ్యే సినిమా బడ్జెట్ సుమారుగా 500 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది.ఈ చిత్రం పూర్తి అవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.విడుదల అయ్యేందుకు మరో ఏడాది సమయం,ఇక రాజమౌళి స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి మరో ఏడాది ఇలా 5 ఏళ్ళ సమయం పడుతుందని విశ్లేషకులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు