SS Rajamouli Made In India : మేడ్ ఇన్ ఇండియా… భారీ పాన్ ఇండియా మూవీ ప్రకటించి షాక్ ఇచ్చిన రాజమౌళి!

గత పదేళ్లలో ఇండియన్ సినిమా స్థాయి ఎల్లలు దాటింది. కలలో కూడా ఊహించలేని ఆస్కార్ సైతం గెలిచే స్థాయికి వెళ్ళింది. ప్రఖ్యాత అంతర్జాతీయ వేదికలపై ఇండియన్ సినిమాలు ప్రదర్శిస్తున్నారు. ఇండియాలో కూడా గొప్ప దర్శకులు ఉన్నారని రుజువైంది. అందివచ్చిన సాంకేతిక వాడుకుంటూ అంతర్జాతీయ ప్రమాణాలతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు.

  • Written By: NARESH ENNAM
  • Published On:
SS Rajamouli Made In India : మేడ్ ఇన్ ఇండియా… భారీ పాన్ ఇండియా మూవీ ప్రకటించి షాక్ ఇచ్చిన రాజమౌళి!

SS Rajamouli Made In India : దర్శకధీరుడు రాజమౌళి ఏం చేసినా ప్రత్యేకమే. చడీ చప్పుడు లేకుండా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించారు. అదేంటీ ఆల్రెడీ మహేష్ బాబుతో మూవీకి కమిట్ అయ్యాడు కదా అనుకోవచ్చు. అయితే ఈ ప్రాజెక్ట్ కి రాజమౌళి నిర్మాత మాత్రమే. రాజమౌళి చిత్రాలకు ఎంత డిమాండ్ ఉన్నా… ఆయన నిర్మాతగా చేసింది ఒకటి రెండు చిత్రాలే. యమదొంగ చిత్రాన్ని విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్లో నిర్మించి దర్శకత్వం వహించాడు. తర్వాత మళ్ళీ ప్రొడక్షన్ చేపట్టలేదు. చాలా కాలం తర్వాత ఆయన ఓ క్రేజీ ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు.

మనం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎన్నో బయోపిక్స్ చూశాము. ఇది ఇండియన్ సినిమా బయోపిక్. ఫస్ట్ ఇండియన్ మూవీ రాజా హరిశ్చంద్ర 1913లో విడుదలైంది. అంటే ఇండియన్ సినిమాకు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా దాదా సాహెబ్ పాల్కే ఉన్నారు. మరి ఇండియన్ సినిమా బయోపిక్ ‘మేడ్ ఇన్ ఇండియా’ లో ఏం చూపించనున్నారనేది ఆసక్తికరం.

మేడ్ ఇన్ ఇండియా చిత్రానికి నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ గుప్త, ఎస్ ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. నటీ నటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. ఇండియన్ సినిమాకు బీజం ఎలా పడింది. దశాబ్దాలుగా ఎదురైన ఒడిదుడుకులు, మార్పులు, అభివృద్ధి వంటి విషయాలు ఈ చిత్రంలో ప్రస్తావించే అవకాశం ఉంది.

గత పదేళ్లలో ఇండియన్ సినిమా స్థాయి ఎల్లలు దాటింది. కలలో కూడా ఊహించలేని ఆస్కార్ సైతం గెలిచే స్థాయికి వెళ్ళింది. ప్రఖ్యాత అంతర్జాతీయ వేదికలపై ఇండియన్ సినిమాలు ప్రదర్శిస్తున్నారు. ఇండియాలో కూడా గొప్ప దర్శకులు ఉన్నారని రుజువైంది. అందివచ్చిన సాంకేతిక వాడుకుంటూ అంతర్జాతీయ ప్రమాణాలతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు.

Read Today's Latest Pratyekam News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు