
RRR Movie
RRR Update: రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో వస్తోన్న ఈ భారీ పిరియాడిక్ యాక్షన్ డ్రామా రన్ టైమ్ ను రాజమౌళి తాజాగా ఫిక్స్ చేశాడు. మొదట మొత్తం సినిమా 3 గంటల 15 నిమిషాలు వచ్చింది. అయితే, అంత టైం సినిమా ఉంటే బోర్ ఫీల్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి.. తాజాగా రాజమౌళి సినిమాని కుదించి.. ఫైనల్ గా ఈ సినిమాను 2 గంటల 45 నిమిషాలకు వచ్చేలా ట్రిమ్ చేశాడు. ఇదే టైంను అన్ని భాషల్లో ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే, 3 గంటల 15 నిమిషాల సినిమాను.. 2 గంటల 45 నిమిషాలకు తగ్గించే క్రమంలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తీసేయాల్సి వచ్చింది. అయితే, ఒక్క ఎన్టీఆర్ సీన్స్ తప్ప.. మిగతా వారి సీన్స్ ను తగ్గించాడు. చరణ్ సీన్స్ ను కూడా తగ్గించాడు. కానీ ఎన్టీఆర్ సీన్స్ లో నుంచి ఒక్క షాట్ కూడా రాజమౌళి తీయడానికి అంగీకరించలేదు. ఎన్టీఆర్ కి రాజమౌళికి మధ్య మంచి అనుబంధం ఉంది.
దాని కారణంగానే మొదటి నుంచి రాజమౌళి, సినిమాలో ఎన్టీఆర్ హైలైట్ అయ్యేలా జాగ్రత్త పడుతున్నాడు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను దుబాయ్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఇప్పటికే రాజమౌళి ప్లాన్ చేశాడు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అల రెడీ తెలుగు వెర్షన్ కి సంబంధించి ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ పాత్రలకు డబ్బింగ్ ను పూర్తి చేశారు.
అలాగే ఎన్టీఆర్ మిగిలిన భాషల్లో కూడా డబ్బింగ్ చెబుతున్నాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడలో కూడా స్వయంగా ఎన్టీఆర్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతుండటం విశేషం. ఏది ఏమైనా ఎన్టీఆర్ టాలెంట్ మెచ్చుకుని తీరాలి. హిందీలో గొప్పగా డబ్బింగ్ చెప్పే డబ్బింగ్ ఆర్టిస్ట్ లు కూడా ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పిన విధానం చూసి ఆశ్చర్యపోయారట. అజయ్ దేవ్‌గణ్ కూడా ఎన్టీఆర్ వాయిస్ విని ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ మెచ్చుకున్నారట.
ఇక ఈ సినిమాలో ఆలియాతో పాటు మిగతా నటీనటులు ఈ సినిమా డబ్బింగ్ పనులు పూర్తి చేసే పనుల్లో ఉన్నారు. తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు జీవిత కథల ఆధారంగా రాజమౌళి ఈ సినిమా చేస్తున్నందుకు అభినందించాలి. పైగా ఈ సినిమాలో ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్ ఎన్టీఆర్ కి జోడిగా నటిస్తోంది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా విడుదల కానుంది.
Also Read: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, రాంచరణ్ మరో కార్యం పూర్తి