RRR Movie : ఆర్ఆర్ఆర్ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచీ.. చాలా మందికి సమాధానం దొరక్కుండా వేధిస్తున్న ప్రశ్న ఒకటుంది. ఈ చిత్రంలో నటించడానికి.. మెగా, నందమూరి హీరోలను జక్కన్న ఎలా ఒప్పించాడన్నదే ఆ ప్రశ్న. దీనికి కొందరు తమవైన ఊహాగానాలు చేస్తే.. చాలా మంది ఇప్పటికీ జుట్టు పీక్కుంటూనే ఉన్నారు. ఇన్నాళ్లకు.. రాజమౌళే ఆ సీక్రెట్ ఏంటో చెప్పేశాడు. మరి, ఆ రహస్యం ఏంటో మీరూ తెలుసుకోండి.

RRR Team
ఆర్ఆర్ఆర్ నుంచి వచ్చిన రెండు టీజర్లు ఇప్పటికే దుమ్ము లేపితే.. తాజాగా విడుదలైన ట్రైలర్ పిచ్చెక్కిస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ దెబ్బకు రికార్డులన్నీ చెల్లా చెదురైపోతున్నాయి. ఆన్ లైన్లో ఆ ఊచకోత కొనసాగుతుండగానే.. ఇటూ ప్రమోషన్ మొదలు పెట్టేశాడు జక్కన్న. ఈ క్రమంలోనే.. ఎన్టీఆర్, రామ్ చరణ్ ను ఈ సినిమాకోసం ఎలా ఒప్పించాడో చెప్పేశాడు.
ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. ఒక రోజు రామ్ చరణ్ ను ఇంటికి పిలిచాడట రాజమౌళి. ఆ తర్వాత ఎన్టీఆర్ ను కూడా పిలిచాడట. నిజానికి ఎందుకు పిలిచాడన్నది వీరిద్దరికీ తెలియదట. వచ్చిన తర్వాత.. మీ ఇద్దరితో కలిసి ఓ మల్టీస్టారర్ చేయాలని భావిస్తున్నట్టు చెప్పేశాడట. ఆ తర్వాత స్టోరీ కూడా మొత్తం చెప్పకుండా.. లైన్ మాత్రమే వినిపించాడట. రియల్ లైఫ్ లో మంచి స్నేహితులైన రామ్ చరణ్, ఎన్టీఆర్.. తమ స్నేహాన్ని రీల్ లైఫ్‌లోనూ చూపించేందుకు సిద్ధమయ్యారని చెప్పాడు జక్కన్న.
ఇక, ఎన్నో సంచలనాలకు కేంద్రబిందువైన ఆర్ ఆర్ ఆర్.. సంక్రాంతికి సరిగ్గా వారం ముందు రిలీజ్ కాబోతోంది. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించిన ఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామా కోసం.. అన్ని వర్గాల ప్రేక్షకులూ ఎదురు చూస్తున్నారు. కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరిగా రామ్ చరణ్.. దుమ్ము లేపబోతుండగా.. ఒలివియా మోరీస్, అలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జనవరి 7న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్.. తెలుగులో ఊహించని రీతిలో దూసుకుపోతోంది. రికార్డుల వేట మొదలుపెట్టిన ఈ ట్రైలర్.. 25 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. హిందీ వెర్షన్ కూడా.. తెలుగుతో సమానంగా వ్యూస్ రాబట్టింది. తమిళంలో 4.5 మిలియన్ వ్యూస్, మలయాలంలో 3 మిలియన్ వ్యూస్, కన్నడలో 6.1 మిలియన్ వ్యూస్ సాధించింది. అన్ని భాషల్లో కలిపి.. 55 మిలియన్ వ్యూస్ కు చేరింది. మరి, సినిమా ఏ స్థాయిలో ప్రతాపం చూపుతుందో చూడాలి.