Rajamouli Sye Movie: రాజమౌళి ‘సై’ మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

Rajamouli: దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా కీర్తిని చాటి చెప్పిన డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. ‘బాహుబలి’ సినిమాతో ఇండియన్ సినిమా అంటే ఏమిటో ప్రపంచానికి చూపించాడు. ఆయన దర్శకత్వలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం ప్రస్తుతం సినీ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆయనతో సినిమా చేయడానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీల నటీనటులు ఎదురు చూస్తున్నారు. ఏదేని చిన్న పాత్ర అయినా సరే ఏళ్ల టైం ఇచ్చేందుకు మేం రెడీ అని అంటున్నారు. కాగా, ఈయనకు కొన్నేళ్ల […]

  • Written By: Naresh
  • Published On:
Rajamouli Sye Movie: రాజమౌళి ‘సై’ మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

Rajamouli: దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా కీర్తిని చాటి చెప్పిన డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. ‘బాహుబలి’ సినిమాతో ఇండియన్ సినిమా అంటే ఏమిటో ప్రపంచానికి చూపించాడు. ఆయన దర్శకత్వలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం ప్రస్తుతం సినీ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆయనతో సినిమా చేయడానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీల నటీనటులు ఎదురు చూస్తున్నారు. ఏదేని చిన్న పాత్ర అయినా సరే ఏళ్ల టైం ఇచ్చేందుకు మేం రెడీ అని అంటున్నారు. కాగా, ఈయనకు కొన్నేళ్ల కిందట ఓ టాలీవుడ్ స్టార్ హీరో నో చెప్పారట. ఆయన ఎవరు? ఇంతకీ అది ఏ సినిమా అనేది తెలుసుకుందాం.

Rajamouli Sye Movie

Rajamouli

కొత్త ఆలోచనలకు రూపమిస్తూ విజ్యువల్ స్టోరి టెల్లర్ గా పేరు గాంచిన రాజమౌళి.. వెండితెరపైన తనదైన శైలిలో అద్భుతమైన చిత్రాలను ఆవిష్కరిస్తాడు.ఇక ఈయన సినిమా వస్తుందంటే చాలు.. కంపల్సరీగా థియేటర్స్ కు వెళ్లి చూడాల్సిందే అనేంతల ప్రేక్షకులు అనుకుంటుంటారు కూడా. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ కెరీర్ ఎలా మారిపోయిందో అందరికీ తెలుసు. అప్పటి వరకు టాలీవుడ్ రెబల్ స్టార్ గా ఉన్న ఆయన.. ఆ చిత్రం తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.

Also Read: Taapsee Pannu: తన ఫిజిక్ సీక్రెట్ చెప్పేసిన తాప్సీ పన్ను

Rajamouli Sye Movie

Rajamouli Pawan-Kalyan

ఇప్పటి వరకు ఆయన 12 సినిమాలు తెరకెక్కించాడు. కాగా, అన్ని చిత్రాలు కూడా బాక్సాఫీసు వద్ద విజయాలే సాధించాయి. అపజయం ఎరుగని దర్శకుడిగా ఆయనకు పేరుంది. అయితే, కలెక్షన్స్ పరంగా ఆయన చిత్రాల్లో కొంత తక్కువ కలెక్షన్స్ అందించిన మూవీగా ‘సై’ ఉంది. నిజానికి ఈ చిత్రాన్ని కూడా టాలీవుడ్ స్టార్ హీరోతో చేయాలని జక్కన్న భావించాడట.

Rajamouli Sye Movie

Sye Movie

ఈ మూవీలో తొలుత హీరోగా పవన్ కళ్యాణ్ ను అనుకున్నాడట రాజమౌళి.కానీ డిఫెరెంట్ కథ కావడంతో స్టోరి విన్నాక పవన్ నో చెప్పేశాడని టాక్. తాను ఎంతో నమ్మకంగా వెళ్లి స్టార్ హీరోకు స్టోరి నెరేషన్ ఇస్తే.. అందులోని స్టోరి గురించి డిస్కషన్ చేసి పవన్ కళ్యాణ్ నిరాకరించాడని సమాచారం. అలా ఆ స్టోరి యంగ్ హీరో నితిన్ వద్దకు వెళ్లింది.

ఈ చిత్రం కూడా బ్లాక్ బాస్టర్ గానే నిలిచింది. కానీ, రాజమౌళి మిగతా చిత్రాలతో పోలిస్తే అంతగా కలెక్షన్స్ ను రాబట్టలేకపోయింది. ఈ చిత్రంలో రగ్బీ గేమ్ గురించి ప్రేక్షకులకు రాజమౌళి పరిచయం చేశాడు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరిలో బలమైన విలనిజం పెట్టి.. స్టోరిని కమర్షియల్ చేసి చక్కగా మూవీని తీశాడు రాజమౌళి. ఈ పిక్చర్‌లో హీరో నితిన్ కు జోడీగా జెనీలియా నటించింది.

Also Read:NTR- SS Rajamouli: ఎన్టీఆర్‌ ను హీరోగా రాజ‌మౌళి ఎందుకు ఇష్ట‌ప‌డ‌లేదు ?

సంబంధిత వార్తలు