
SS Rajamouli
SS Rajamouli: దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి అంటే ఒక బ్రాండ్. నేషనల్ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు డైరెక్టర్. ఇలాంటి డైరెక్టర్ నుంచి వస్తున్న ఎంతో ప్రతిష్టాత్మక సినిమా ‘ఆర్ఆర్ఆర్’. అన్నిటికీ మించి ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలు. తెలుగు చిత్రసీమను ఏలిన రెండు అగ్ర కుటుంబాల నిజమైన వారసులు వీళ్ళు. ఇలాంటి క్రేజీ కాంబినేషన్ ను తెలుగు తెర మళ్ళీ చూస్తోంది అని చెప్పలేం. అయితే, ఆ స్థాయి హైప్ ఈ సినిమాకి రావడం లేదు.
ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందుకే, చిత్రబృందం కూడా ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సెకండ్ సాంగ్..నాటు…నాటు ఫుల్ సాంగ్ బుధవారం సాయంత్రం రిలీజ్ కానుంది. కానీ ఈ సాంగ్ పై జనంలో పెద్దగా ఆసక్తి లేదు. అసలు ఆ మాటకొస్తే.. ఈ సినిమా పై ఎందుకో అభిమానులు కూడా నిరాశతో ఉన్నారు.
‘రాజమౌళి(SS Rajamouli) సినిమా అయితే, మాకేంటి ?’ అనే భావన అభిమానుల్లో ఎక్కువ అయింది. కారణం.. వాళ్ళ ఎమోషన్స్ తో అంచనాలతో రాజమౌళి ఆడుకుంటున్నాడు అనే వ్యతిరేఖత ఫ్యాన్స్ లో రోజురోజుకు ఎక్కువవుతూ వచ్చింది. మరి ఇది ఇలాగే కొనసాగితే.. సినిమాకు బలం అవ్వాల్సిన అభిమానులు బలహీనత గా మారే ప్రమాదం ఉంది.
అసలకే దాదాపు రూ. 5 వందల కోట్లు పెట్టి భారీ స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు రాజమౌళి. ఏది ఏమైనా ఈ చిత్రానికి రావాల్సినంతగా హైప్ రావడం లేదు. హీరోల పై కట్ చేసిన టీజర్లు పర్వాలేదు అనిపించినా అంచనాలను మాత్రం అందుకోలేదు. ఈ నేపథ్యంలో వస్తోన్న ‘నాటు…నాటు…వీరనాటు..ఊరనాటు’ అంటూ వస్తోన్న ఈ సినిమా రెండో సాంగ్ కీలకంగా మారింది.
తెలుగులోనే ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్లు ఎన్టీఆర్ – చరణ్ కలిసి పవర్ ఫుల్ స్టెప్పులు వేస్తున్నారు. మరి ఈ సాంగ్ కు రావాల్సిన స్థాయిలో గుర్తింపు రాకపోతే మాత్రం అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఆర్ఆర్ఆర్ సినిమాకు ‘నాటు’ కీలకం. సినిమాకి హైప్ తీసుకొచ్చే పాట కూడా ఇదే. మరి ఈ పాట ఎలా ఉంటుందో చూడాలి. తేడా కొడితే.. రాజమౌళి పై నమ్మకం పోయే ప్రమాదం ఉంది.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’లో రాజమౌళి ఓల్డ్ స్టైల్‌తో కనిపించనున్నారా!
రాజమౌళితో పెట్టుకోవడం ఎందుకు? మహేష్ బాబు అందుకే తగ్గాడా?