Rajamouli Mahesh Babu Movie: మహేష్ ని మారణాయుధం గా మారుస్తున్న రాజమౌళి… మూడు నెలలు అక్కడ ట్రైనింగ్!

నెక్స్ట్ మహేష్ బాబుతో మూవీ ప్రకటించిన రాజమౌళి టార్చర్ షురూ చేశాడని తెలుస్తుంది. మహేష్ బాబు మూడు నెలలు విదేశాల్లో గపడనున్నాడట. అక్కడ ఆయన స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారట. ప్రత్యేకమైన యుద్ధ విద్యల్లో శిక్షణ కోసం విదేశాలకు వెళ్లాలని రాజమౌళి మహేష్ బాబుకి సూచించారట. గుంటూరు కారం షూటింగ్ ముగిసిన వెంటనే మహేష్ బాబు ట్రైనింగ్ తీసుకోనున్నారట.

  • Written By: Shiva
  • Published On:
Rajamouli Mahesh Babu Movie: మహేష్ ని మారణాయుధం గా మారుస్తున్న రాజమౌళి… మూడు నెలలు అక్కడ ట్రైనింగ్!

Rajamouli Mahesh Babu Movie: హార్డ్ వర్క్, పెర్ఫెక్షన్… రాజమౌళి సక్సెస్ సీక్రెట్స్. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని జాగ్రత్తగా చెక్కుతాడు. ఆశించిన అవుట్ ఫుట్ వచ్చే వరకు నటులను, సాంకేతిక నిపుణులతో చెమటలు కక్కిస్తారు. రాజమౌళితో పని చేయడం అంత సులభం కాదు. ఈ వయసులో రాజమౌళి సినిమాలో నటించలేనని స్వయంగా చిరంజీకి ఓ సందర్భంలో చెప్పడం విశేషం. నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకోగా ఆ సాంగ్ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు చుక్కలు చూపించాడు. ఇద్దరి మూమెంట్స్ మధ్య సింక్ సాధించడానికి నార తీశాడట.

నెక్స్ట్ మహేష్ బాబుతో మూవీ ప్రకటించిన రాజమౌళి టార్చర్ షురూ చేశాడని తెలుస్తుంది. మహేష్ బాబు మూడు నెలలు విదేశాల్లో గపడనున్నాడట. అక్కడ ఆయన స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారట. ప్రత్యేకమైన యుద్ధ విద్యల్లో శిక్షణ కోసం విదేశాలకు వెళ్లాలని రాజమౌళి మహేష్ బాబుకి సూచించారట. గుంటూరు కారం షూటింగ్ ముగిసిన వెంటనే మహేష్ బాబు ట్రైనింగ్ తీసుకోనున్నారట.

రాజమౌళి-మహేష్ కాంబోలో జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ రానుంది. ఈ మూవీలో మహేష్ బాబు సాహసవీరుడిగా కనిపించనున్నాడు. మహేష్ పై హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, ఒళ్లు గగ్గురిగొల్పే స్టంట్స్ చిత్రీకరించనున్నారట. ఈ క్రమంలో పాత్రకు తగట్లు మహేష్ ని రాజమౌళి సిద్ధం చేయనున్నారట. ఈ మధ్య మహేష్ ఎక్కువగా జిమ్ లో కనిపిస్తున్నారు. అది కూడా రాజమౌళి సినిమాలో భాగమే అన్నమాట వినిపిస్తోంది.

ఇక వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ భారీ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. రాజమౌళి కుటుంబ సభ్యులతో తమినాడు ట్రిప్ లో ఉన్నారు. ఆయన పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. ట్రిప్ ముగించుకుని వచ్చిన వెంటనే మహేష్ ప్రాజెక్ట్ పై ద్రుష్టి పెట్టనున్నారు. ఈ చిత్ర బడ్జెట్ రూ. 800 కోట్లని సమాచారం. హాలీవుడ్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తగ్గకుండా మహేష్ మూవీ ఉండనుందని సమాచారం. ఆర్ ఆర్ ఆర్ కి మించి ఉంటుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే చెప్పారు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు