Bigg Boss 6 Telugu- Raj: బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం ఇంటి నుండి బయటకి వెళ్ళడానికి నామినేటైన ఇంటి సభ్యులు రాజ్ , ఫైమా ,ఇనాయ , శ్రీ సత్య , శ్రీహాన్ , రోహిత్ , ఆది రెడ్డి..వీరిలో ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో ఇనాయ , శ్రీ సత్య మరియు శ్రీహాన్ సేఫ్ అవ్వగా ఆది రెడ్డి ,రాజ్ , ఫైమా మరియు రోహిత్ ఇంకా నామినేషన్స్ లో ఉన్నారు..వీరిలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అని ప్రేక్షకుల్లో నెలకొన్న ఉత్కంఠ కి తెరపడింది..వోటింగ్ ప్రకారం అయితే ఫైమా కి అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.

Bigg Boss 6 Telugu- Raj
కానీ ఆమెకి గత వారం ‘ఏవిక్షన్ ఫ్రీ పాస్’ లభించడం తో ఆమె ఈ ఎలిమినేషన్ నుండి తప్పించుకుంది..అయితే ఆమెకంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న రాజ్ మాత్రం ఎలిమినేట్ అయిపోయాడు..ఇది నిజంగా రాజ్ ని అభిమానించే వారికి చాలా బాధ వేస్తుంది అనే చెప్పొచ్చు..ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో అద్భుతంగా ఆడే కంటెస్టెంట్స్ లో ఒకరు రాజ్.
ఎలాంటి ఫేమ్ లేకుండా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన రాజ్ రెండవ వారం లోనే ఎలిమినేట్ అవ్వాల్సింది..కానీ తన ఆట ని వారం వారం కి ఇంప్రూవ్ చేసుకుంటూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా రాజ్ ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికి నచ్చింది..అలాంటి రాజ్ టాప్ 5 లో ఉంటాడు అని అందరూ అనుకున్నారు కానీ గత మూడు వారాల నుండి రాజ్ నామినేషన్స్ లోకి రాకపోవడమే అతను ఎలిమినేట్ అవ్వడానికి ప్రధాన కారణం అయ్యింది..ఇంటి సభ్యులందరు ఆ కారణం తోనే నామినేట్ చేసారు..జనాలు కూడా రాజ్ కి వోట్ వెయ్యడం లో అలవాటు తప్పారు..ప్రస్తుతం ఉన్న హౌస్ మేట్స్ అందరిలో తక్కువసార్లు నామినేటైన ఇంటి సభ్యుడు కూడా రాజ్ అనే చెప్పొచ్చు.

Bigg Boss 6 Telugu- Raj
అందుకే ఆయనకీ తగిన ఫ్యాన్ బేస్ ఏర్పడలేదని..అందుకే ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని విశ్లేషకులు చెప్తున్న మాట..అయితే రాజ్ బిగ్ బాస్ హౌస్ ద్వారా ఇప్పటి వరుకు ఎప్పుడు చూడని ఫేమ్ ని చూసాడు..బయటకి వెళ్లిన తర్వాత అతని కెరీర్ ఎలా ఉంటుందో చూడాలిమరి.