Rainbow Diet: కొత్త రెయిన్ బో డైట్.. దీన్ని తింటే ఇక మీకు ఏ రోగాలు రావు

నీలం కలర్ కోసం ఊదారంగు కూరగాయలు, బ్లూ బెర్రీలు, గ్రేప్స్, వంకాయ, క్యాబేజీలను చేర్చుకుంటే కలర్ బాగుంటుంది. తెలుపు కోసం కాలీఫ్లవర్, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పుట్టగొడుగులు చేర్చుకుంటే ఎంతో చూడముచ్చటైన కలర్లతో ఇంధ్రధనుస్సును పోలిన రంగు కనిపిస్తుంది. దీన్నే రెయిన్ బో ఫుడ్ గా చెబుతున్నారు.

  • Written By: Shankar
  • Published On:
Rainbow Diet: కొత్త రెయిన్ బో డైట్.. దీన్ని తింటే ఇక మీకు ఏ రోగాలు రావు

Rainbow Diet: ఈ మధ్య కాలంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. సరైన సమతుల ఆహారం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. ఇందులో భాగంగానే రెయిన్ బో డైట్ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆరోగ్యం మెరుగవుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రకరకాల చర్యలు తీసుకుంటుంటాం. దీని కోసమే రెయిన్ బో డైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

రెయిన్ బో ఫుడ్ అంటే పోషకాలతో నిండినది. ఇందులో అన్ని పదార్థాలు ఎంతో రుచికరమైనవి. ప్రొటీన్లు కలిగినవి కావడం గమనార్హం. ఇలా ఈ ట్రెండ్ ప్రజాదరణ పొందుతోంది. మొదట ఎరుపు రంగులో ఉండే టమాటాలు, ఎర్రని క్యాక్షికం, స్ట్రాబెర్రీలు, పుచ్చకాయ వంటి ఆహారాలను ఉంచుకోవాలి. మూత్ర నాళ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి.

తరువాత ఆరెంజ్ కలర్ ఉన్నవి చిలగడదుంప, ఆఫ్రికాట్ లను చేర్చుకోవాలి. ఇవి శరీరంలోని మంటలను అదుపు చేస్తాయి. తరువాత పసుపు రంగు ఆహారాలు ఉండాలి. ఫైనాపిల్, అరటిపండ్లు, పసుపు రంగు క్యాప్షికం, నిమ్మకాయలు వంటివి ఉంచుకోవాలి. ఆకు పచ్చ వాటిలో బ్రొకోలీ, అవకాడో, బచ్చలికూర వంటి చేర్చుకుంటే ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

నీలం కలర్ కోసం ఊదారంగు కూరగాయలు, బ్లూ బెర్రీలు, గ్రేప్స్, వంకాయ, క్యాబేజీలను చేర్చుకుంటే కలర్ బాగుంటుంది. తెలుపు కోసం కాలీఫ్లవర్, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పుట్టగొడుగులు చేర్చుకుంటే ఎంతో చూడముచ్చటైన కలర్లతో ఇంధ్రధనుస్సును పోలిన రంగు కనిపిస్తుంది. దీన్నే రెయిన్ బో ఫుడ్ గా చెబుతున్నారు.

విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న పండ్లు, కూరగాయలు చర్మానికి ఎంతో మేలు కలిగిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుంది. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. తక్కువ కేలరీలు ఉండటం వల్ల మనకు ఆరోగ్యాన్ని రక్షించడంలో సాయపడతాయి. అందుకే ఈ ఫుడ్ ను తీసుకోవడం ఉత్తమం.
Recommended Video:

Read Today's Latest Health news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు