Rahul Gandhi- Modi
Rahul Gandhi- Modi: నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది.. ఆ మాటలు మంచిని ప్రోది చేస్తే ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఆ మాటలు వివాదాస్పదమైతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ ఇటువంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారు. ఏకంగా ఆయన సభ్యత్వం పై వేటుపడే ప్రమాదం ముంగిట ఉన్నారు. మోడీ అనే ఇంటి పేరు మీద రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేసినందున ప్రస్తుతం ఆయన చిక్కుల్లో పడ్డారు. గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది. రెండేళ్లపాటు జైలు శిక్ష పడ్డ రాహుల్ గాంధీ పై పార్లమెంటులో అనర్హత విషయమై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఆయనపై వేటుపడచ్చని కాషాయ పార్టీ నాయకులు భావిస్తున్నారు.
ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 8(3) ప్రకారం ఏదైనా కేసులో దోషిగా నిర్ధారణ అయ్యి రెండేళ్లు శిక్ష పడితే చట్టసభ సభ్యులు తమ సభ్యత్వం కోల్పోతారు. శిక్షకాలంతోపాటు మరో ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతారు. ఈ క్రమంలో సూరత్ కోర్టు తీర్పు ఆధారంగా లోక్ సభ సచివాలయం రాహుల్ ను అనర్హుడిగా చేసి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళ రాష్ట్రంలోని వయనాడు లోక్ సభ నియోజకవర్గం ఖాళీ అయినట్టు ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ ఇది జరిగితే ఎన్నికల కమిషన్ కూడా ఉప ఎన్నిక ప్రకటిస్తుంది. సూరత్ కోర్టు తీర్పు పై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు స్టే ఇవ్వకపోతే ఎనిమిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాహుల్ గాంధీకి ఉండదు.. ఈ నేపథ్యంలో అప్పిలు చేసుకునేందుకు కోర్టు నెలరోజులు కడుగు ఇచ్చిన నేపథ్యంలో రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ శిక్షణ హైకోర్టు సస్పెండ్ చేయకపోయినా.. సూరత్ కోర్టు తీర్పును నిలుపుదల చేయకున్నా… సుప్రీంకోర్టుకు వెళ్తామని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.. ఐపిసి 499, 500 సెక్షన్ల కింద క్రిమినల్ పరువు నష్టం దావా కేసులో రెండేళ్లు శిక్ష విధించడం చాలా అరుదు అని కొందరు నాయకులు అంటున్నారు.. మరోవైపు లోక్ సభ సభ్యత్వానికి రాహుల్ గాంధీ అనర్హుడని తక్షణమే ప్రకటించాలని సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ గురువారమే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కోరడం విశేషం.
Rahul Gandhi- Modi
మరోవైపు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారిస్తూ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు పై హైకోర్టులు స్టే విధిస్తే ఆయనపై అనర్హత వేటు పడదని కొందరు న్యాయ నిపుణులు చెబుతున్నారు. అనర్హత రేటు పడకుండా ఉండాలి అంటే కోర్టు తీర్పును సస్పెండ్ చేయడం… శిక్షపై స్టే విధించడం తప్పనిసరిని న్యాయవాదులు చెప్తున్నారు.. ఒకవేళ ఆయనకు బెయిల్ వేటు పడే అవకాశాలు ఉండవని వివరిస్తున్నారు..ఇక తీర్పు పై స్టే విధించడం, దోష నిర్ధారణ పై స్టే విధించడం వేరని చెబుతున్నారు. వేటు పడకుండా ఉండాలంటే నేర నిర్ధారణ పై రాహుల్ స్టే పొందటం అత్యవసరమని పేర్కొంటున్నారు.
“లిల్లీ థామస్ కేసు తీర్పులో రెండేళ్లు అంతకుమించిన శిక్ష పడితే యధావిధిగా అనర్హత వేటు పడుతుందని సుప్రీంకోర్టు పేర్కొన్నది. 2018 లో లోక్ ప్రభారీ కేసులో ఓ అప్పీల్ పై తీర్పు ఇస్తూ నేర నిర్ధారణను సస్పెండ్ చేస్తే.. అనర్హతను కూడా నిలుపుదల చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని” రాజ్యాంగ కోవిదుడు రాకేష్ ద్వివేది చెబుతున్నారు. కోర్టు తీర్పు ప్రకటించిన మరుక్షణమే అనర్హత వేటు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన వివరించారు.. ఇక పార్లమెంటు సభ్యత్వం రద్దు అయితే.. శిక్షకాలం పూర్తయ్యక ఆరేళ్ల వరకు అంటే దాదాపు 8 సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీచే అవకాశం ఉండదు.. రాహుల్ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే లోపే అనర్హత వేటుపడితే.. చనిపోయిన న్యాయస్థానానికి వెళ్లే అవకాశం ఉండదు.
చట్టసభ సభ్యులకు రెండేళ్లు, అంతకుమించి శిక్ష విధిస్తే తక్షణమే అనర్హత వేటు పడుతుందని లిల్లీ థామస్ కేసులో 2013లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.. అప్పట్లో ఎంపీగా ఉన్న ఆర్జెడి నేత లాలు ప్రసాద్ యాదవ్ పై అనర్హత వేటు పడింది. తీర్పును నీరు కార్చేందుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ మేరకు ఒక ఆర్డినెన్స్ కూడా తెచ్చింది. అప్పుడు రాహుల్ గాంధీ ఈ అర్డి నెన్స్ ను విలేకరుల సమావేశం పెట్టి మరీ చించేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ ఆర్డినెన్స్ కు గురికావడం విశేషం.. దీనినే విధిరాత అంటారేమో! అయినా నోరు అదుపులో ఉంటే ఈ కష్టాలు వచ్చేవి కావు కదా! పాపం రాహుల్!!