Rahul Gandhi- CM Jagan: యూరప్‌లో రాహుల్ గాంధీ.. లండన్‌లో జగన్.. ఎందుకీ చర్చ?
జగన్‌మోహన్‌రెడ్డి పదిరోజుల పాటు లండన్‌లో పర్యటిస్తారని సమాచారం. అయితే యూరప్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీని జగన్ కలిసినట్టు ప్రచారం జరుగుతోంది.

Rahul Gandhi- CM Jagan: దేశంలో జీ-20 సదస్సు జరుగుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ యూరప్ వెళ్లారు. అక్కడికి ఎందుకోసం వెళ్లారో కాంగ్రెస్ వర్గాలు చెప్పడం లేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఫొటోలు షేర్ చేయడం లేదు. జీ-20 సదస్సు జరుగుతున్న క్రమంలో ఆయన యూరప్ అకస్మాత్తుగా వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. మరో వైపు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి లండన్ వెళ్లారు. ఆయన మీద కేసులు ఉండటంతో సీబీఐ కోర్టు అనుమతి తీసుకుని ఆయన లండన్ కుటుంబసమేతంగా వెళ్లారు. అక్కడ ఆయన కూతుర్లు చదువుతున్న విషయం తెలిసిందే.
జగన్‌మోహన్‌రెడ్డి పదిరోజుల పాటు లండన్‌లో పర్యటిస్తారని సమాచారం. అయితే యూరప్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీని జగన్ కలిసినట్టు ప్రచారం జరుగుతోంది. అత్యంత రహస్యంగా సాగుతున్న పర్యటనలో రాహుల్ గాంధీతో భేటీ అయ్యారనే అభిప్రాయం జాతీయ మీడియా వ్యక్తం చేయడం విశేషం. వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామని ఆయన ఇప్పటికే కొంతమంది ద్వారా రాయబారం పంపారనే వాదనలు ఉన్నాయి. వాటికి బలం చేకూర్చేలా యూరప్‌లో రాహుల్‌గాంధీని ప్రత్యక్షంగా కలిసారని, పొత్తుల అంశంపై చర్చలు జరిపారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీలో షర్మిల విలీనం ఆపేందుకు ఆమె కాంగ్రెస్‌లో చేరితే తనకు నష్టమని జగన్ భాస్తున్నారు. అందుకే ఆమె విలీనం ఆపాలని.. తర్వాత వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇస్తానని ప్రకటించినట్టు తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే ఏపీలో.. జాతీయ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని వైసీపీ నాయకులు, ఇతర నేతలు ఖండించలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మీద వైసీపీ నాయకులు దారుణమైన భాష ఉపయోగించేవారు. విజయసాయిరెడ్డి వంటి వారు ఎన్నోసార్లు రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. కొంతకాలం నుంచి వారంతా సైలెంట్ అయ్యారు.
దీంతో జగన్ కాంగ్రెస్‌కు దగ్గరవుతున్న సూచనలు కన్పిస్తున్నా యని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
