Raghav – Parineeti Chopra : ఘనంగా మొదలైన రాఘవ్ – పరిణీతి చోప్రా నిశ్చితార్ధ వేడుక
గత కొంత కాలం నుండి హాలీవుడ్ లోనే నివాసం ఉంటున్న పరిణీతి చోప్రా అక్క ప్రియాంక చోప్రా కేవలం ఈ నిశ్చితార్ధ వేడుక కోసం షూటింగ్ కార్యక్రమాలు రద్దు చేసుకొని వచ్చిందట.

Raghav – Parineeti Chopra : బాలీవుడ్ లో గత కొంతకాలం నుండి ప్రియాంక చోప్రా సోదరి పరిణీతి చోప్రా ప్రముఖ ఎంపీ రాఘవ్ చద్దా తో ప్రేమలో ఉన్నట్టు, వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇలా పలు రకాల వార్తలు వచ్చాయి. అయితే అవి కేవలం రూమర్స్ మాత్రమే అని ఈ ఇద్దరు మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా కొట్టిపారేసేవారు.
కానీ వీళ్లిద్దరు ప్రైవేట్ పార్టీలకు వెళ్లడం, పబ్బులకు వెళ్లడం వంటివి అన్నీ మీడియా మొదటి నుండి గమనిస్తూనే ఉంది.గతం లో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ – సిద్దార్థ్ మల్హోత్రాలు కూడా ఇలాగే ప్రవర్తించి, చివరికి పెళ్లి పీటల మీద కూర్చొని అందరికీ ట్విస్ట్ ఇచ్చారు.ఇప్పుడు రాఘవ్ – పరిణీతి చోప్రా పరిస్థితి కూడా అలాగే మారింది.
నేడు మే 13 వ తేదీన ఢిల్లీలో కపుర్తాల హౌస్ లో సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభం అయ్యింది.ఈ నిశ్చితార్ధ వేడుకకు కేవలం 150 మందికి మాత్రమే ఆహ్వానం అందింది అట. గత కొంత కాలం నుండి హాలీవుడ్ లోనే నివాసం ఉంటున్న పరిణీతి చోప్రా అక్క ప్రియాంక చోప్రా కేవలం ఈ నిశ్చితార్ధ వేడుక కోసం షూటింగ్ కార్యక్రమాలు రద్దు చేసుకొని వచ్చిందట.
ఈ నిశ్చితార్ధ వేడుకకు బంధుమిత్రులతో పాటుగా బాలీవుడ్ కి చెందిన కొందరు ప్రముఖులు హాజరు కాబోతున్నారు, అలాగే రాజకీయ నాయకులూ కూడా హాజరు అవుతున్నారు.వచ్చే నెలలోనే వివాహం కూడా జరుపుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు కుటుంబ సభ్యులు.
