Chanakya Neeti: చాణక్య నీతి ఈ గుణాలుంటేనే భార్య.. అందుకు ఏం చేయాలంటే?
Chanakya Neeti: ఆచార్య చాణక్యుడు భార్యల గుణాల గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. ఆ రోజుల్లో చాణక్యుడు చెప్పిన విషయాలు నేటికి కూడా అనుసరణీయంగానే ఉన్నాయి. దీంతో భార్యగా చేసుకునే వారికి ఉండాల్సిన లక్షణాలేంటి? వారితో మనం ఎలా జీవించాలి? వారితో ఎలా పని చేయించుకోవాలి? అనే విషయాలను వివరంగా సూచించాడు. భార్య అంటే పవిత్రంగా, కౌశలంగా, పవిత్రతగా, భర్త పట్ల అనురాగం కలిగి ఉండేలా, భర్తతో నిజం చెప్పేదిగా అంటేనే భార్యకు పరిపూర్ణ అర్థం వస్తుందని […]


Chanakya Neeti
Chanakya Neeti: ఆచార్య చాణక్యుడు భార్యల గుణాల గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. ఆ రోజుల్లో చాణక్యుడు చెప్పిన విషయాలు నేటికి కూడా అనుసరణీయంగానే ఉన్నాయి. దీంతో భార్యగా చేసుకునే వారికి ఉండాల్సిన లక్షణాలేంటి? వారితో మనం ఎలా జీవించాలి? వారితో ఎలా పని చేయించుకోవాలి? అనే విషయాలను వివరంగా సూచించాడు. భార్య అంటే పవిత్రంగా, కౌశలంగా, పవిత్రతగా, భర్త పట్ల అనురాగం కలిగి ఉండేలా, భర్తతో నిజం చెప్పేదిగా అంటేనే భార్యకు పరిపూర్ణ అర్థం వస్తుందని చెబుతాడు.
చాణక్యుడి ఉద్దేశం
చాణక్యుడి ఉద్దేశం ఏమిటంటే మన జీవిత భాగస్వామి పవిత్రంగా ఉండాలని సూచిస్తాడు. తన భర్త ఎడల ప్రేమానురాగాలు పంచాలి. అన్యోన్యంగా కాపురం చేయాలి. సంసారంలో కలతలు రాకుండా చూసుకోవాలి. భర్తకు అన్ని విషయాల్లో సహకరించాలి. భర్తను అన్నింట్లో ముందుండి నడిపించాలి. అప్పుడే భర్తకు విజయాలు సంప్రాప్తిస్తాయి. భర్త విజయమే తనకు స్ఫూర్తిగా తీసుకోవాలి. మంచి విషయాల్లో తోడుగా నిలబడి ముందుండి ప్రోత్సహిస్తే భర్తకు బలం చేకూరుతుంది. వేయి ఏనుగుల బలం వచ్చినంత పని అవుతుంది.
Also Read: Kondagattu Temple Theft Case: కొండగట్టు ఆలయం దొంగలను పట్టించిన బీరు సీసా!
అబద్దాలు
ఇక నిత్యం అబద్ధాలు చెబితే భర్తకు ఇబ్బందులు వస్తాయి. భర్తకు నిజాన్ని చెప్పాలి. నిజమైన భార్య అనిపించుకోవాలంటే భర్తకు అపకీర్తి రాకుండా చూసుకుంటేనే మంచిది. అంత:కరణ శుద్ధితో వ్యవహరించాలి. భర్త చేసే పనుల్లో వెనకుండి నడిపించాలి. స్వచ్ఛమైన ఆలోచనలతో ఇంటిని చక్కదిద్దుకునే పనిలో ఉండాలి. నిష్కళంకంగా భర్త సేవలో తరించాలి. ఇలా చేస్తేనే ఉత్తమ భార్యగా అభివర్ణించవచ్చు. ఆచార్య చాణక్యుడు భార్యల విషయంలో ఎన్నో రకాలుగా భర్త ఆలోచనలకు ప్రతిరూపంగా నిలవాలని చెబుతాడు.
త్రికరణ శుద్ధిగా..
మనసా వాచా కర్మణా అన్నట్లు మనసు, తనువు, మాట అన్ని భర్త కోసమే అన్నట్లుగా ప్రవర్తించాలి. భర్తకు అనుగుణంగా నిలిచి తన మార్గంలో భార్య ఓ తివాచి కావాలి. తాను నడిచే తోవలో రోడ్డుగా మారాలి. అప్పుడే భర్తకు భార్య మీద అభిమానం పెరుగుతుంది. తన కర్తవ్య నిర్వహణలో భర్తే లోకంగా బతకాలి. భర్తకు ఎప్పుడు సత్యమే చెప్పాలి. భర్తను అవమానించే విధంగా మాట్లాడితే ఆవిడ భార్యే కాదు. హాస్యానికి కూడా భార్య భర్తతో తప్పుగా ప్రవర్తించొద్దు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా స్త్రీ ఎలా ఉండాలో చెప్పాడు చాణక్యుడు. తాను రాసిన వివరాల ఆధారంగా భార్యల పరిస్థితి ఎలా ఉండాలనేదానిపై కూలంకషంగా వివరించాడు.
Also Read: Indian Army Eagle Training: ఇక గద్దలతోనే గగనతల నిఘా.. కొత్త అస్త్రం సిద్ధం చేసిన ప్రభుత్వం
