
Q News Office
Q News Office: క్యూ న్యూస్ ఆఫీస్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం దాడి చేశారు. మారణా యుధాలతో వచ్చి తీన్మార్ మల్లన్న ను బెదిరించారు. ఆఫీస్ లో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్, అద్దాలను పగలగొట్టారు. మంత్రి మల్లారెడ్డి కి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తే చంపేస్తామని బెదిరించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తీన్మార్ మల్లన్న, సుదర్శన్ గౌడ్ స్థానిక బోడుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆదివారం ఉదయం మార్నింగ్ షో విత్ మల్లన్న ప్రసారం పూర్తికాగానే 20 మంది దుండగులు ముఖానికి ముసుగులు ధరించి క్యూ ఆఫీస్ లో అడుగు పెట్టారు. చేతిలో ఆయుధాలతో ఆఫీసులోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తే చంపేస్తామని హెచ్చరించారు. విలువైన హార్డ్ డిస్క్ లు ఎత్తుకెళ్లిపోయారు. కార్యాలయంలో ఉన్న పెన్ డ్రైవ్ లను ధ్వంసం చేశారు.. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఎందుకు వార్తలు ప్రసారం చేస్తున్నారంటూ బెదిరించారు. బోడుప్పల్ నుంచి క్యూ న్యూస్ ఆఫీస్ ఎత్తేయాలని హెచ్చరించారు.

Q News Office
గత కొంతకాలం నుంచి బోడుప్పల్ లో ఉన్న క్యూ న్యూస్ ఆఫీస్ ఎత్తేయాలని మల్లన్న ను గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారు. చివరకు మేడిపల్లి సిఐ కూడా క్యూ న్యూస్ ఆఫీస్ ఉన్న ఇంటి ఓనర్ ను పిలిచి బెదిరించాడు..మల్లన్న ను ఉన్న ఫలంగా క్యూ న్యూస్ ఆఫీస్ ఖాళీ చేయించాలని కోరాడు. కాని దానికి ఓనర్ ఒప్పుకోలేదు. ఇటీవల లిక్కర్ స్కాం కు సంబంధించి మల్లన్న సంచలనమైన వార్తలు ప్రసారం చేస్తున్నాడు. దీంతో సహజంగానే భారత రాష్ట్ర సమితి క్యూ న్యూస్ పై ఆగ్రహంగా ఉంది.. మంత్రి కేటీఆర్ కూడా క్యూ న్యూస్ ఆఫీస్ ను ఎత్తేయించాలని ఉన్నతాధికారుల ద్వారా మేడిపల్లి సీఐ కి చెప్పించినట్టు సమాచారం. అయితే సీఐ ఆదేశించినా క్యూ న్యూస్ ఆఫీస్ ఓనర్ దాన్ని ఖాళీ చేయించేందుకు ఒప్పుకోలేదు. పైగా మల్లన్న కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు ఆగ్రహంగా ఉన్నారు. మొన్నామధ్య మల్లారెడ్డి కి సంబంధించి వార్తను ప్రసారం చేయడంతో ఆయన అనుచరులు ఆగ్రహంగా ఉన్నారు. మల్లన్నకు ఫోన్ కాల్స్ చేశారు . ఆదివారం ఇలా దాడికి దిగారు. మరోవైపు తొలివెలుగు ఛానల్ లో కీలకంగా పనిచేసే రఘు ను ఆ ఛానల్ నుంచి బయటికి గెంటివేసి ఒక్క రోజు కూడా కాకముందే తీన్మార్ మల్లన్న ఛానల్ పై దాడి జరగడం విశేషం.