Double Ismart Movie: ఎట్టకేలకు పూరి షురూ చేశాడు భయ్యా..!
డబుల్ ఇస్మార్ట్ మూవీలో నటించే నటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కొట్టింది.

Double Ismart Movie: దర్శకుడు పూరి జగన్నాధ్ కెరీర్ ఆటుపోట్లతో సాగుతుంది. ఇస్మార్ట్ శంకర్ తో ఫార్మ్ లోకి వచ్చాడనుకుంటే లైగర్ మళ్ళీ క్రింద పడ్డారు. ఒకప్పటి ఈ స్టార్ డైరెక్టర్ కి హీరోలు ఆఫర్స్ ఇచ్చే పరిస్థితి లేదు. లైగర్ తో పూరి ఇమేజ్ భారీగా దెబ్బతింది. అయితే హీరో రామ్ పోతినేని పూరి జగన్నాధ్ పై భరోసా ఉంచారు. హిట్ ఇచ్చిన దర్శకుడికి మరో ఆఫర్ ఇచ్చారు. వీరి కాంబోలో డబల్ ఇస్మార్ట్ టైటిల్ తో మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. నేడు పూజా కార్యక్రమాలతో మూవీ లాంచ్ చేశారు.
డబల్ ఇస్మార్ట్ పూజా కార్యక్రమంలో దర్శకుడు పూరి, నిర్మాత ఛార్మి, హీరో రామ్ పోతినేని పాల్గొన్నారు. కాగా జులై 12 నుండి షూటింగ్ మొదలు కానుంది. ప్రకటన రోజే విడుదల తేదీ ఫిక్స్ చేశారు. 2024 మార్చి 8న మూవీ వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఇది పాన్ ఇండియా మూవీనా కాదా అనే విషయం వెల్లడించలేదు. దర్శకుడు పూరి గత చిత్రం లైగర్ ఐదు భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే.
డబుల్ ఇస్మార్ట్ మూవీలో నటించే నటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కొట్టింది. వరల్డ్ వైడ్ రూ. 75 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న పూరి-ఛార్మీలను ఇస్మార్ట్ శంకర్ కాపాడింది. మళ్ళీ నిలదొక్కుకునేలా చేసింది. ఉన్నవన్నీ ఊడ్చి ఇస్మార్ట్ శంకర్ మూవీ చేశారు. డబల్ ఇస్మార్ట్ టైటిల్ ఇస్మార్ట్ శంకర్ టైటిల్ ని పోలి ఉంది. ఈ క్రమంలో ఇది సీక్వెల్ కావచ్చనే ఊహాగానాలు ఉన్నాయి.
మరోవైపు రామ్ పోతినేనికి ఇస్మార్ట్ శంకర్ తర్వాత హిట్ లేదు. ఆయన గత చిత్రం ది వారియర్ నిరాశపరిచింది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్కంద మూవీ చేస్తున్నాడు. రామ్ పోతినేని నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. బోయపాటి శ్రీను మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. శ్రీలీల హీరోయిన్ కాగా థమన్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 15న స్కంద విడుదల కానుంది.
View this post on Instagram
