
Operation Amritpal Singh
Operation Amritpal Singh: ఆ మధ్య మనం చెప్పుకున్నాం కదా పంజాబ్ లో ఖలిస్థానీ ఉద్యమం తీవ్రస్థాయిలో జరుగుతోందని.. నాడు ఇందిరకు పట్టిన గతే మీకు పడుతుందని నరేంద్ర మోడీ, అమిత్ షా ను హెచ్చరించే స్థాయికి ఎదిగిందని.. ఇప్పుడు దాని మూలాలు పెకిలించే పనిలోపడ్డాడు అమిత్ షా. అంతేకాదు గత ఏడాది పంజాబ్ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లిన ప్రధాని మోదీని ఖళీస్థానీ మద్దతుదారులు నడిరోడ్డుపై నిలువరించారు. దీంతో ప్రధాని జాతీయ భద్రత దళం పర్యవేక్షణలో అత్యంత కట్టుదిట్టంగా ఢిల్లీ వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకే కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయింది. ఆప్ ప్రభుత్వం కొలువుదిరింది. ఇక అప్పటినుంచి ఖళీస్థానీ మద్దతుదారుల ఆగడాలకు అంతే లేకుండా పోయింది.. తాజాగా తనను తాను బృందన్ వాలే వారసుడిగా చెప్పుకుంటున్న అమృత్ పాల్ సింగ్ అనే వ్యక్తి ఏకంగా పంజాబ్లో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. ప్రత్యేక ఖలిస్తానీ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాడు. ఈమధ్య తన అనుచరుడిని పోలీసులు అరెస్టు చేస్తే, ఏకంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి , అక్కడ దాడి చేసి అతడిని విడిపించుకుని వెళ్లారు. నరేంద్ర మోడీ, అమిత్ షా కు ఇందిరాగాంధీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించి వెళ్లారు.
ఇంత జరిగినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ నోరు కూడా మెదపలేదు. ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ కనీసం పలెత్తు మాట కూడా మాట్లాడలేదు.. మరోవైపు ఆప్ సర్కారు అధికారంలోకి వచ్చేందుకు ఆ ఖళీస్థానీ ఉగ్రవాదులే కారణమని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అమృత్ పాల్ సింగ్ అనుచరుల ఆట కట్టించేందుకు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి ఖళీస్థానీ వాదంతో.. విద్వేష వ్యాఖ్యలతో అత్యంత సమస్యాత్మకంగా మారిన అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేసేందుకు ఏకంగా హాలీవుడ్ సినిమా రేంజ్ లో చేజింగ్ చేశాయి. ఇందుకు గానూ వంద వాహనాలను ఉపయోగించాయి. అయితే ఇప్పటివరకు ఆరుగురు ప్రధాన అనుచరులతో కలిపి 84 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం వరకు పంజాబ్లో ఇంటర్నెట్ నిర్వహిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది.

Operation Amritpal Singh
శనివారం పంజాబ్ రాష్ట్రం జలంధర్ లోని షా కోట్ తహ సీల్ కు అమృత పాల్ తన కాన్వాయ్ తో వెళ్తుండగా.. పంజాబ్ లోని ఏడు జిల్లాల పోలీసులతో కూడిన ప్రత్యేక బృందం అతడిని 100 వాహనాలతో చేజ్ చేసింది. అయితే పోలీసుల కళ్ళు కప్పి అమృత్ పాల్ ఓ బైక్ పై పరారయ్యాడని చెబుతున్నారు. అమృత్ పాల్ మస్కా కొట్టినప్పటికీ ఆయన ప్రధాన అనుచరులు ఆరుగురు తో కలిపి 84 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అమృత్ పాల్, ఆయన సానుభూతిపరులు ఎటువంటి విద్వేషపూరితమైన సందేశాలు, వీడియో సందేశాలు సర్క్యులేట్ చేయకుండా ఉండేందుకు పంజాబ్ అంతట ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఎలాగైనా అమృత్ పాల్ ఆట కట్టించేందుకు అమృత్సర్ జిల్లాలోని ఆయన స్వగ్రామాన్ని పంజాబ్ పోలీసు బలగాలు, కేంద్ర పారా మిలిటరీ బలగాలు దిగ్భందించాయి. అమృతసర్ జిల్లా సరిహద్దులను పూర్తిగా మూసివేశాయి. వెంట్రుకవాసిలో అమృత్ పాల్ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు కానీ.. అతన్ని ఎలాగైనా అరెస్ట్ చేస్తామని కేంద్ర బలగాలు చెబుతున్నాయి. మరో వైపు దేశ అంతర్గత భద్రతకు ప్రధానముప్పుగా పరిణమించిన ఖళీస్థానీ ఉగ్రవాదాన్ని రూపుమాపే పనిలో అమిత్ షా పడ్డాడు. ఇందులో భాగంగా దాని మూలాలు చెరిపివేసే కార్యంలో నిమగ్నమయ్యాడు. ఇకనుంచి కెనడా లో ఖళీస్థానీ మద్దతుదారులపై ఒక కన్నేసి ఉంచాలనే నిర్ణయానికి వచ్చాడు.