Pulivendula vs Kuppam: పులివెందుల వర్సెస్ కుప్పం: రివెంజ్ అంటే ఇలా ఉండాలి
Pulivendula vs Kuppam: అభిరామి కమల్ హాసన్ బుగ్గ కొరికె. సరసం. కమల్ హాసన్ కొరుకుడు కాదు నమిలి మింగిండు. అభిరామి చేతిల బజ్జీని ! ఏందది అని ఆమె అడిగితే చెప్తడు, నువ్ కొరికితే నేను ఊరకే ఉంటనా, నేనూ కొరికినా అని ! అట్లుంటది కొందరి రివేంజ్. హుషారున్నడులె ! సినిమాల్లో జీవితాల్లోనె గాదు రాజకీయంలో గిట్ల రివేంజ్ ఉండొచ్చు. ఉంటది. నువ్ వచ్చి పులిసందుల తిరగలే ? కూసో కూసో పెద్దమనిషీ అని […]

Pulivendula vs Kuppam: అభిరామి కమల్ హాసన్ బుగ్గ కొరికె. సరసం. కమల్ హాసన్ కొరుకుడు కాదు నమిలి మింగిండు. అభిరామి చేతిల బజ్జీని ! ఏందది అని ఆమె అడిగితే చెప్తడు, నువ్ కొరికితే నేను ఊరకే ఉంటనా, నేనూ కొరికినా అని ! అట్లుంటది కొందరి రివేంజ్. హుషారున్నడులె ! సినిమాల్లో జీవితాల్లోనె గాదు రాజకీయంలో గిట్ల రివేంజ్ ఉండొచ్చు. ఉంటది. నువ్ వచ్చి పులిసందుల తిరగలే ? కూసో కూసో పెద్దమనిషీ అని మా ఎంపీకి హెచ్చరిక చేయలే ? అట్టనే, మేం కూడా కుప్పం వస్తం. తిరుగుతం. తప్పేంది ? కాకపోతే, నువ్ నీళ్లిచ్చేందుకు పులిసందుల వచ్చినవ్. మేం నీకు కన్నీళ్లిచ్చేందుకు వస్తుంటిమి. ఇవ్వగల్గుతమా లేదా అనేది తేల్చాల్సింది నడిమిట్ల జనం. నువ్వూ నేనూ గాదు !

jagan, chandrababu
ఇంతోటి దానికి హిందూస్థానీ మేళం ఎందుకండి ? అర్థం గాదు. ఏం తిరక్కూడదా కుప్పంలో ? రాష్ట్రంలో ఉన్న 175 నియోజక వర్గాల్లో కుప్పం కూడా ఒకటి. బాధ్యత గల పౌరుడిగా, నాయకుడిగా హండ్రెడ్ పర్సెంట్ హక్కున్నది. తిరగనీకి. తిరుగొచ్చు. తిరగాలె. తిరిగితెనె, తెలుసుకుంటెనె… తెలవొచ్చు. కుప్పంలో ఏం జరిగుండె ఇప్పటిసంది, మా ఇలాకలా ఏం జేయొచ్చు – అన్నది ఐడియా రావొచ్చు. ఇంటర్ డిగ్రీ కాలేజీలు ఎలా కట్టొచ్చు, యునివర్సిటీలు ఎలా పెట్టొచ్చు అన్నది ఎరికైతది. హాస్పిటళ్లు కట్టుడు, మందిని జమజేసి గునగున కూర్చుండబెట్టి కుట్టు మిషన్లు పెట్టి కుట్టించుడు, ఎక్సుపోర్టు జేసుడు, గవేందో ఐ కమ్యూనిటీ లాంటివి తెచ్చుడు. ఇంకేందో జేస్తివంట కదా – ఇప్పుడు కాదు పదిహేనేళ్ల నాడే కలామ్ సాబ్ చెప్పిండు. అవన్నీ జర్రంత జూసిపోతే అయిపోయె. తప్పేం లేదు.
సీట్ల ఉన్నోల్లు వస్తె, కొంత మజాక్ ఉంటది. గడబిడ అయితది. ఏదీ, నువ్వొస్తెనే ఆయనెవరో గుండు కొట్టించుకుండు మీడియా ముంగట. ఏమైంది… పులిసందుల ఒక్క ఓటు పెరిగినాదా ఆ గుండుతోని టీడీపీకి ? లే ! నువ్వొచ్చి సవాల్ జేస్తివి… తేల్చుకుందాం అని ! మరి తేల్చుకుంటివా ? లే ! నీ పని నీకు సరిపాయె. బీజేపీ మధ్యల ఉంగ్లి పెట్టె… ఎలచ్చన్ టైమ్ ఎట్లపాయెనో నీకు తెల్వదు. ఇక పులిసందుల దిక్కేం చూస్తవ్. అట్లనే ఉంటవ్ గీ పంచాయితీలన్నీ. నువ్ జేసినప్పుడు జేస్తివి. మరి గిప్పుడు వాల్లు జేయరూ… జేస్తరు. నీ స్టైల్లా నువ్ నీళ్లిచ్చినవ్. నీకు కన్నీళ్లిచ్చుడనేది గిప్పటి సంది వాల్ల టార్గెట్. ఆ మాత్రం ఫరక్ ఉంటది. ఫోకస్ పాయింటు కాస్త అటు ఇటు గావొచ్చు. పరేషాన్ కాకుండ్రి.

jagan , chandrababu
ఇంతోటి దానికి ఎందుకువయా సోషల్ మీడియాలో లొల్లి లొల్లి జేస్తున్రు. ఫరక్ పడదీ ఈ లొల్లితోని ! జేయాల్సింది సోషల్ మీడియాలా కాదు. తేల్సుకుంటే బెటర్ ! టీడీపీ ఆఫీస్ ల మైకుల ముందో, ఫేస్ బుక్కుల లైకులతోనో గాయిగత్తరతోని పనులు జరగయి. కుప్పంలో స్థానిక సంస్థల ప్రతినిధులు టీడీపీల కెల్లి వైసీపీలోకి గుస్సాయించిన్రు అని ఖబరొచ్చింది. తెల్లారిగిట్లా, గా ఈనాడు రాయాలె. కాలీ కండువా కప్పిన్రు, పైసలిస్తమని చెప్పిన్రు – నాకేం తెల్వద్, నేను టీడీపీలోనె ఉన్నా అని గా లీడరంటడు. ఈయ్యాల్రేపు, ఈనాడు మస్తు సెన్సిటివ్ అయితుండె. చిన్నచిన్న సంగతులకిట్ల పరేషాన్ అయ్యి – పరిశోధన చేయబట్టె. అందుకే గీ రాతలన్ని. అవసరమా ?
ఇంకో ముచ్చట యాదికొచ్చె ! నీ నియోజక వర్గం మీద ఒక మంత్రిని పెట్టి ఫోకస్ పెట్టిన్రటా… ఆయనే చేరికలు చేస్తడట. ఆయన కొడుకు కూడా ఎంపీనట. ఇద్దరూ కలిసి నీ పార్టీని గుంజ బట్టిరట. మరి నువ్వేం చేయలె అప్పట్లా ? నీకూ ఉండె కదా గప్పట్లో… మడుగులో మంత్రి. ఏమయ్యిండు ? పీకిండా ఇప్పుడు ? ఉన్నడా ? జర జవాబ్ చెప్పున్రి ! ఇందాం. ఉంగిలి పెట్టి ఇడిజేస్తే ఇట్లనె ఉంటది. కెలికితె కెవ్వుమనాలె. లేదంటే గమ్మునుండాలె. కిరాయెళ్లని నమ్మి, మన ఛానెళ్లల లైవులు పెట్టి, శామ్ తక్, ఛుప్ చాప్ అయిపోయినమనుకో… ఇట్లనె అయితది.
అయినా ఏం గాదు. పరేషాన్ మత్ లో ! మన స్టేట్ అయితే మస్తు పాపులర్ అయితాంది ఇండియా వైడ్. ఒకటి సాలంటే, అదేం నడవదీ కమ్ సె కమ్ మూడైనా ఉండాలె రాజధాని – అని పట్టుపట్టి మన రేంజి పెంచుడు మొదలు… యూరోప్ లాంటి రోడ్లు వేసుడు గాన్నుంచి, పోలవరం లాంటి బడాబడా సించాయి ప్రాజెక్టులు పెట్టుడు గాన్నుంచి, పెట్టుబడులు పెట్టించుడు, దునియాకెల్లి బెస్ట్ కంపెనీలు రప్పించుడు, మస్తుమస్తు స్కీమ్సు పెట్టి మందిని ఖుషీ జేసుడు, గవేందో గప్పటిసంది ఇప్పటి వరకి ఎక్కడా సూడని తాగని బ్రాండ్లు తెచ్చి తాపించుడు, అన్నిటికీ మించి ఎకానమీని టిక్ టాక్ పెట్టుడు, అంబేద్కర్ సాబ్ ఇచ్చిన రాజ్యాంగాన్ని కళ్లకద్దుకొనుడు వరకు మస్తు చేస్తుండె. గియ్యన్నీ మస్తు నడుస్తుంటె… మీరేంది వయా కుప్పం కుప్పం అని లప్పం పెడుతున్రు. ఇలాంటి ట్రెండులు పెట్టకండి. మనదసలే డెలికేట్ మైండ్. ఉన్న ట్రెండును ఉండనియ్యండి ప్లీజ్.
