కోరిక తీర్చలేదని త్రిషపై నిర్మాత ఫైర్

లేటు వయస్సులోనూ కుర్ర హీరోయిన్లకు పోటీనిస్తూ త్రిష వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ఇటీవల కొంత గ్యాప్ తీసుకున్న త్రిష మళ్లీ బడా హీరోలు నటిస్తున్న సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని బీజీగా మారింది. త్రిషకు తెలుగు, తమిళంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా త్రిష చేసిన పనికి ఓ నిర్మాత ఫైర్ అవుతున్నాడు. త్రిషతో ‘పరమపదం విలయవత్తు’ మూవీని తమిళంలో నిర్మించాడు. ఈ మూవీ ప్రమోషన్లో పాల్గొనాలని త్రిషను కోరాడు. అయితే ఆమె మాటమాత్రం చెప్పకుండా ప్రమోషన్లో […]

  • Written By: Neelambaram
  • Published On:
కోరిక తీర్చలేదని త్రిషపై నిర్మాత ఫైర్

లేటు వయస్సులోనూ కుర్ర హీరోయిన్లకు పోటీనిస్తూ త్రిష వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ఇటీవల కొంత గ్యాప్ తీసుకున్న త్రిష మళ్లీ బడా హీరోలు నటిస్తున్న సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని బీజీగా మారింది. త్రిషకు తెలుగు, తమిళంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా త్రిష చేసిన పనికి ఓ నిర్మాత ఫైర్ అవుతున్నాడు. త్రిషతో ‘పరమపదం విలయవత్తు’ మూవీని తమిళంలో నిర్మించాడు. ఈ మూవీ ప్రమోషన్లో పాల్గొనాలని త్రిషను కోరాడు. అయితే ఆమె మాటమాత్రం చెప్పకుండా ప్రమోషన్లో పాల్గొనేలేదని దర్శక, నిర్మాతలు అసహనం వ్యక్తం చేశారు.

త్రిష నటించిన పరమపదం విలయట్టు మూవీ ఏడాదిగా రిలీజుకు నోచుకోలేదు. త్రిష లేడి ఓరియంటెడ్ పాత్రలో నటించింది. ఈ మూవీని ఫిబ్రవరి 28న రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేసింది. ఇందులో భాగంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఈ ప్రమోషన్లో త్రిషను పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. ఆమె వస్తారని ఏర్పాటు చేసుకున్న వారికి త్రిష షాక్ ఇచ్చింది. ఆమె హాజరుకాకపోవడంతో నిర్మాతలు టి.శివ, సురేష్ కమాచిలు బహిరంగగానే అసహనం వ్యక్తం చేశారు.

ఎంత పెద్ద స్టార్లయినా తమ సినిమాల ప్రమోషన్లకు హాజరు కావాల్సిందేనని నిర్మాతలు అంటున్నారు. వాళ్ల సినిమాల ప్రమోషన్లకు కూడా వారు హాజరుకాకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏడాది కాలంగా చిత్ర రిలీజు కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సినిమా రిలీజు కాకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని వాపోయారు. తమది న్యాయమైన కోరిక అని చెబుతున్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరుకాకపోయిన మిగతా కార్యక్రమాల్లో త్రిష పాల్గొంటుందని ఆశిస్తున్నామని చెప్పారు. త్రిష హాజరుకాకోతే ఆమె పారితోషకంలో కోత విధించనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

సంబంధిత వార్తలు