సీనియర్ నిర్మాత కన్నుమూత

ప్రముఖ హీరోలతో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించి తన కంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న సీనియర్ నిర్మాత సి వెంకట్రాజు అనారోగ్య కారణం గా చెన్నైలో కన్నుమూసారు. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా రంగానికి చెందిన వ్యక్తులు , బంధువులు ఆకస్మికం గా కనుమరుగవుతున్నారు. గత కొద్దికాలం క్రితం నటుడు శ్రీకాంత్ తండ్రి, అంతకు ముందు ఆలీ తల్లి , ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు ఇలా వరుస మరణాలు సంభవించాయి. ఇప్పుడు తాజాగా […]

  • Written By: Neelambaram
  • Published On:
సీనియర్ నిర్మాత కన్నుమూత

ప్రముఖ హీరోలతో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించి తన కంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న సీనియర్ నిర్మాత సి వెంకట్రాజు అనారోగ్య కారణం గా చెన్నైలో కన్నుమూసారు. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా రంగానికి చెందిన వ్యక్తులు , బంధువులు ఆకస్మికం గా కనుమరుగవుతున్నారు. గత కొద్దికాలం క్రితం నటుడు శ్రీకాంత్ తండ్రి, అంతకు ముందు ఆలీ తల్లి , ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు ఇలా వరుస మరణాలు సంభవించాయి. ఇప్పుడు తాజాగా సీనియర్ నిర్మాత సి వెంకట్రాజు ఆదివారం నాడు చెన్నై లో మృతి చెందటం జరిగింది.

శ్రీ విజయలక్ష్మి ప్రొడక్షన్స్, గీతాచిత్ర ఇంటర్నేషనల్ వంటి బ్యానర్ల ఫై ఎన్నో మరపురాని చిత్రాలను వెంకట్రాజు ప్రేక్షకులకి అందించారు. మరో నిర్మాత బి శివరాజు తో కలిసి ఈయన నిర్మించిన తొలి చిత్రం టు టౌన్ రౌడీ .ఆ తరవాత అదే వెంకటేష్ హీరోగా పవిత్ర బంధం, పెళ్లిచేసుకొందాం , ఘర్షణ వంటి హిట్ చిత్రాలను నిర్మించడం జరిగింది. మొత్తం తన కెరీర్ లో ఈయన 16 చిత్రాలను నిర్మించడం జరిగింది. వెంకట్రాజు గారు నిర్మించిన చిత్రాల్లో వెంకటేష్ చిత్రాలు కాక నియంత, ఆదర్శం , శ్రీమతి వెళ్ళొస్తా , చక్రం వంటి విభిన్న చిత్రాలు ఉన్నాయి. వీటిలో చక్రం చిత్రం ప్రభాస్ ని నటుడిగా మరో మెట్టు ఎక్కించిన చిత్రంగా నిలిచింది.
Men may die but popularity never dies

సంబంధిత వార్తలు