Bigg Boss 7 Telugu: హీరో హీరోయిన్ కి గుండు… ఫైనల్ గా ఆమె బలి, అయితే తీరిన కోరిక!

అమర్ దీప్, ప్రియాంకలలో ఎవరు జుట్టు కత్తిరించుకుంటారో వారు కంటెండర్ గా పోటీలో ఉంటారు అని చెప్పారు. అమర్ దీప్ అబ్బాయి కాబట్టి 3 సెంటీమీటర్ల క్లిప్ పెట్టి హెడ్ ట్రిమ్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు.

  • Written By: Shiva
  • Published On:
Bigg Boss 7 Telugu: హీరో హీరోయిన్ కి గుండు… ఫైనల్ గా ఆమె బలి, అయితే తీరిన కోరిక!

Bigg Boss 7 Telugu: గ్లామర్ ఇండస్ట్రీలో అందమే పెట్టుబడి. చక్కని రూపంతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. అప్పుడే కెరీర్ నిలబడుతుంది. మరి ఒక వ్యక్తి అందంగా కనిపించాలంటే జట్టు చాలా అవసరం. అందుకే జుట్టును నటులు జాగ్రత్తగా కాపాడుకుంటారు. అంతటి విలువైన జుట్టును త్యాగం చేయడమనేది చిన్న విషయం కాదు. బిగ్ బాస్ హౌస్లో టాప్ కంటెస్టెంట్స్ కి ఈ పరీక్ష ఎదురైంది. అమర్ దీప్ చౌదరి కంటెండర్ కావడానికి అనర్హుడని ప్రియాంక వెల్లడించిన నేపథ్యంలో వీరిద్దరికీ బిగ్ బాస్ టాస్క్ పెట్టాడు.

అమర్ దీప్, ప్రియాంకలలో ఎవరు జుట్టు కత్తిరించుకుంటారో వారు కంటెండర్ గా పోటీలో ఉంటారు అని చెప్పారు. అమర్ దీప్ అబ్బాయి కాబట్టి 3 సెంటీమీటర్ల క్లిప్ పెట్టి హెడ్ ట్రిమ్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. అంటే ఆల్మోస్ట్ గుండు అన్నమాట. ఇక ప్రియాంకకు బాయ్ కట్ సూచించాడు. భుజాల కంటే పైకి కట్ చేయాలి. అమర్ దీప్ ఇందుకు ససేమిరా అన్నాడు. నేను జుట్టు తీసుకోను అన్నాడు. నేను రవితేజ ఫ్యాన్. ఆయన ఒకసారి నా జుట్టు టచ్ చేస్తూ అచ్చు నా జుట్టులా ఉందని అన్నాడని అమర్ దీప్ ఎమోషనల్ అయ్యాడు.

అలాగే తనకు తలపై కుట్లు ఉన్నాయి. అవి కనిపిస్తాయి. నేను జుట్టు శాక్రిఫైజ్ చేయకపోవడానికి అది కూడా కారణం అన్నాడు. అయితే ప్రియాంక ఇందుకు మొదటి నుండి సంసిద్ధంగా ఉంది. అమర్-ప్రియాంక మధ్య కొంత డిస్కషన్ జరగ్గా… ఒక నిర్ణయానికి వచ్చారు. అమర్ దీప్ జుట్టు కట్ చేసుకోవడానికి నిరాకరించాడు. ప్రియాంక బాయ్ కట్ చేయించుకుంది. ఈ కారణంగా అమర్ దీప్ స్థానంలో ప్రియాంక కంటెండర్ రేసులో నిలిచింది.

అయితే బాయ్ కట్ ప్రియాంకకు బాగా సూట్ అయ్యింది. చాలా క్యూట్ గా ఉన్నావంటూ హౌస్ మేట్స్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. గతంలో సీజన్ 4లో బిగ్ బాస్ ఈ టాస్క్ విధించాడు. అప్పుడు యూట్యూబర్ అలేఖ్య హారిక తన జుట్టు కట్ చేసుకుంది. ఆమె కూడా బాయ్ కట్ చేయించుకుంది. అయితే ఇది సదరు కంటెస్టెంట్ కి చాలా అడ్వాంటేజ్. హౌస్లో చివరి వారాల వరకు వాళ్ళు ఉంటారని చెప్పేందుకే హింట్. అలేఖ్య హారిక ఫైనల్ కి వెళ్లిన విషయం తెలిసిందే…

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు