Priyanka Chopra: బాలీవుడ్ నటి ప్రియాంకచోప్రా మిగతా నటుల కంటే భిన్నంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆమె సంచలన కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఆమె సినిమా నటులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటీనటులు ఎవరో చెప్పిన విషయాన్ని చేస్తారు.. స్వతాహాగా వారు ఏం చేయరు.. కానీ వారంటే ప్రేక్షకులకు ఎంతో అభిమానం.. అని అన్నారు. దాదాపు 13 ఏళ్ల తరువాత సొంత గడ్డకు వచ్చిన ప్రియాంక చోప్రా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆస్ట్రేలియా నటుడు నిక్కీ జాన్సన్ ను 2018లో వివాహం చేసుకున్నారు. వీరికి 2022లో సరోగసి ద్వారా ఓ బిడ్డ జన్మించింది.

Priyanka Chopra
‘తమింజాన్’ అనే తమిళ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక చోప్రా. ఆ తరువాత ‘లవ్ స్టోరీ ఆప్ స్పై’ అనే మూవీతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. అందం, అభినయంతో ఆకట్టుకునే ఈ భామ ఈ ఇండస్ట్రీలో స్టార్ నటిగా దూసుకెళ్లింది. ఆ తరువాత హాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడా స్టార్ భామల సరసన చేరింది. ఆమె నటించిన ఓ వెబ్ సిరీస్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఆ తరువాత పలు సినిమాల్లో అవకాశాలు రావడంతో అమె అక్కడే సెటిల్ అయింది.
ప్రియాంక నిత్యం వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అమెరికాలో ప్రసారం అయిన‘ ది యాక్టివిస్ట్’ రియాలిటీ షో కు ఆమె హోస్టుగా చేసింది. ఇందులో ఆరోగ్యం, విద్య, పర్యావరణం లాంటి అంశాలపై చర్చిస్తారు.ఈ సూచనలను జీ 20 సమావేశంలో వివరించాలని అనుకుంటున్నామని అన్నారు. అయితే ఇలాంటి సామాజిక అంశాలను రియాలిటీ షో వేదికగా చర్చించడం వివాదం అయింది. దీంతో ఆమెపై తీవ్ర విమర్శలు రావడంతో ఆ తరువాత క్షమాపణలు చెప్పింది.

Priyanka Chopra
తాజాగా ప్రియాంక చోప్రా మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బాలీవుడ్లో నేను కొనసాగినప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను దర్శకుల వద్ద నుంచి నేర్చుకున్నా. నటీనటుల కెరీర్ గురించి నాకు ఒకటే అనిపిస్తుంటుంది. స్వతహాగా వారు ఏం చేయరు. డైరెక్టర్ చెప్పిన విషయాన్ని చేస్తారు. ఎవరో రచయిత రాసిన మాటలను చదువుతారు. ఎవరో డ్యాన్స్ కంపోజ్ చేస్తే ఆడతారు.. గాయనీ గాయకులు పాడిన పాటలు లిప్ సింక్ చేస్తారు.. కానీ వారిని ప్రేక్షకులు వారికే ఎప్పుడూ క్రెడిట్ ఇస్తారు..’ అని అన్నారు. దీంతో ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.