Priyanka Chopra Daughter: బాలీవుడ్ స్టార్ లేడీ ప్రియాంక చోప్రా ఫస్ట్ టైం తన కూతురిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఏడాది వయసున్న మాలతి మారి చోప్రా జోనాస్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మోడల్ అయిన ప్రియాంక చోప్రా ఓ తమిళ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. ఆమె ఫస్ట్ హీరో విజయ్. అయితే బాలీవుడ్ లో ఆమె స్టార్ గా ఎదిగారు. టాప్ హీరోయిన్ గా పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. అందరు స్టార్ హీరోలతో జతకట్టారు. బాలీవుడ్ లో ఫార్మ్ లో ఉండగానే ఆమె హాలీవుడ్ పై కన్నేశారు. పలు ఇంగ్లీష్ చిత్రాలు, టెలివిజన్ సిరీస్లలో నటించారు.

Priyanka Chopra Daughter
అమెరికన్ టెలివిజన్ సిరీస్ క్వాంటికో ఆమెకు భారీ ఫేమ్ తెచ్చింది. హాలీవుడ్ లో సెటిలైన ప్రియాంక చోప్రా హిందీ పరిశ్రమకు దాదాపు దూరమయ్యారు. అమెరికాలో ఖరీదైన నగరాల్లో ఒకటైన లాస్ ఏంజెల్స్ లో అపార్ట్మెంట్ కొన్నారు. అక్కడే కాపురం పెట్టారు. అమెరికన్ సింగర్, యాక్టర్ నిక్ జోనాస్ ని ప్రేమించిన ప్రియాంక వివాహం చేసుకున్నారు. 2018 డిసెంబర్ లో వీరి వివాహం జరిగింది. భర్త నిక్ కంటే ప్రియాంక పదేళ్లు పెద్దది. ఈ విషయంలో ఆమె ట్రోల్స్ కి గురయ్యారు.
పెళ్ళైన నాలుగేళ్లకు 2022 జనవరిలో సరోగసీ ద్వారా ప్రియాంక తల్లి అయ్యారు. ప్రియాంక-నిక్ దంపతులకు పాప పట్టింది. ఆ అమ్మాయికి మాలతి మారి చోప్రా జోనాస్ అని పేరు పెట్టారు. ఇరు కుటుంబాల ఫ్యామిలీ మెంబర్స్, సర్ నేమ్స్ కలిసేలా అలా నేమ్ సెట్ చేశారు. ప్రస్తుతం పాపకు ఏడాది వయసు. ఇంతవరకు ప్రియాంక కూతురు మాలతిని మీడియా కంట పడనీయలేదు. కూతురితో ప్రియాంక ఫోటోలు ఉన్నాయి కానీ స్పష్టంగా ఫేస్ కనబడకుండా ఆమె జాగ్రత్త పడింది.

Priyanka Chopra Daughter
ఎట్టకేలకు ప్రియాంక కూతురి ఫోటోలు బయటకు వచ్చాయి. జోనాస్ బ్రదర్స్ వాక్ ఆఫ్ ఫేమ్ సెరిమోనికి భర్త నిక్ తో పాటు ప్రియాంక హాజరైంది. ఈ ఈవెంట్లో ప్రియాంక మాలతి ఫేస్ రివీల్ చేశారు. అమ్మ ప్రియాంక ఒడిలో కూర్చొని ఆడుకుంటున్న మాలతి ఏంజెల్ లా ఉంది. ఒక్కసారిగా ప్రియాంక డాటర్ ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేశాయి. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. హాలీవుడ్, బాలీవుడ్ మీడియాలో ప్రియాంక కూతురు ఫోటోలు ప్రధానంగా ప్రచురించబడ్డాయి.