https://oktelugu.com/

WPL 2024 : ఒకే ఓవర్ లో మూడు వికెట్లు.. ఢిల్లీకి బెంగళూరు బౌలర్ షాక్

ముఖ్యంగా బెంగళూరు బౌలర్ సోఫీ మొలి నెక్స్ 64 పరుగుల వద్ద ఢిల్లీ జట్టుకు సంబంధించిన కీలక వికెట్లను పడగొట్టింది. మొలి నెక్స్ ధాటికి షఫాలీ వర్మ వారే హమ్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయింది. రోడ్రిగ్స్, క్యాప్సీ 0 పరుగులకు మొలి నెక్స్ బౌలింగ్లో ఔట్ అయ్యారు. దీంతో ఢిల్లీ జట్టు 64 పరుగుల వద్ద కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది.

Written By:
  • NARESH
  • , Updated On : March 17, 2024 9:28 pm
    Bangalore bowler Sophie Moli Nex

    Bangalore bowler Sophie Moli Nex

    Follow us on

    WPL 2024 : ఢిల్లీ వేదికగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. బెంగళూరు, ఢిల్లీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు వేలాదిమంది అభిమానులు రావడంతో అక్కడి మైదానం కిటకిటలాడుతోంది. ఫైనల్ మ్యాచ్లో ముందుగా ఢిల్లీ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. ఎప్పటిలాగే ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ షఫాలీ వర్మ ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది.. తొలి వికెట్ కు లానింగ్, షఫాలీ వర్మ 7.1 ఓవర్లలో 64 పరుగులు జోడించారు.. 64 పరుగుల వద్ద తొలి వికెట్ గా షఫాలీ వర్మ(44) అవుట్ అయిన తర్వాత జేమీమా రోడ్రిగ్స్ (0) గోల్డెన్ డక్ గా ఔట్ అయింది. ఆ తర్వాత వచ్చిన క్యాప్సి (0) కూడా ఖాతా ప్రారంభంచకుండానే వెను జరిగింది. దీంతో ఒక్కసారిగా ఢిల్లీ జట్టు లో షాక్ కు గురైంది. 64 పరుగుల వద్ద కీలకమైన మూడు వికెట్లు కోల్పోవడంతో పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. భారీ స్కోర్ సాధిస్తుందనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా ఢిల్లీ జట్టు తడబడింది.

    ముఖ్యంగా బెంగళూరు బౌలర్ సోఫీ మొలి నెక్స్ 64 పరుగుల వద్ద ఢిల్లీ జట్టుకు సంబంధించిన కీలక వికెట్లను పడగొట్టింది. మొలి నెక్స్ ధాటికి షఫాలీ వర్మ వారే హమ్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయింది. రోడ్రిగ్స్, క్యాప్సీ 0 పరుగులకు మొలి నెక్స్ బౌలింగ్లో ఔట్ అయ్యారు. దీంతో ఢిల్లీ జట్టు 64 పరుగుల వద్ద కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో జట్టు భారం మొత్తం లానింగ్స్ పై పడింది. అయితే ఒత్తిడిలో ఆమె కూడా తడబడింది.. శ్రేయాంక పాటిల్ బౌలింగ్లో లానింగ్స్(23) అవుట్ అయింది. దీంతో 74 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఢిల్లీ జట్టు తీవ్ర కష్టాల్లో పడింది.

    మిగతా ఆటగాళ్లు కూడా రాణించకపోవడంతో ఢిల్లీ జట్టు ప్రస్తుతం 18 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 113 పరుగులు చేసింది. ఒకే ఓవర్ లో మూడు వికెట్లు తీసి మొలి నెక్స్ ఢిల్లీ జట్టును వణికించగా, శ్రేయాంక కూడా మూడు వికెట్లు తీసి సత్తా చాటింది.. శోభన రెండు వికెట్లు పడగొట్టి తన ప్రతిభను చూపింది.. మరో రెండు ఓవర్లు ఉన్న నేపథ్యంలో.. ఢిల్లీ జట్టు ఏ మేరకు స్కోరు సాధిస్తుందో వేచి చూడాల్సి ఉంది. స్పిన్నర్లకు మైదానం సహకరిస్తుందని క్యూరేటర్ చెప్పిన నేపథ్యంలో.. అది బెంగళూరు బౌలింగ్ ద్వారా నిరూపితమైంది.