Mahesh Babu- Rajamouli: సూపర్ స్టార్ మహేశ్ బాబు పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. చిత్ర పరిశ్రమలో ఆయన అందరిని కలుపుకుపోతున్నా.. సూపర్ స్టార్ ను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సినీ ఇండస్ట్రీలో తామంతా ఒక్కటే అని చెబుతున్నా.. వారిలో అసలు క్యారెక్టర్ వేరే ఉందని పేర్కొంటున్నారు. మహేశ్ బాబు కొందరు హీరోలు, నటులను సోషల్ మీడియా ద్వారా పలకరించినా.. ఎదుటి వారిలో ఆ స్పందన లేకపోవడం గమనార్హం. అయితే మహేశ్ మాత్రం అందరూ తన వారే అన్నట్లుగా ముందుకు పోతున్నారు. దీంతో ‘ఇండస్ట్రీలో అంత మంచితనం పనికిరాదు అన్నా’ అంటూ ఫ్యాన్స్ ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేశ్ బాబుకు ప్రత్యేక క్రేజ్ ఉంది. ఈమధ్య ఆయన సినిమాలు వరుసగా హిట్టవుతున్నాయి. ఇండస్ట్రీలోకి ఎందరో యంగ్ కుర్రాళ్లు ఎంట్రీ ఇచ్చినా వారికి పోటీగా మహేశ్ దూసుకుపోతున్నాడు. 40 ఏళ్లు దాటినా ఇప్పటికీ మహేశ్ తో నటించాలని చాలా మంది హీరోయిన్లు క్యూ కడుతున్నారు. అయితే సినిమాల్లో నటనతో మనసు దోచుకునే మహేశ్ రియల్ లైఫ్లోనూ మంచితనాన్ని పంచుతున్నాడు. ఇండస్ట్రీలో వాళ్లంతా తనవాళ్లే అన్న విధంగా నడుచుకుంటున్నారు. కానీ మహేశ్ బాబు ను మిగతా హీరోలు పట్టించుకోవడం లేదని ఫ్యాన్స్ అంటున్నారు.
Also Read: Rana Daggubati: ప్రముఖ హీరోయిన్ స్థలం కోసం కోర్టు మెట్లు ఎక్కిన రానా దగ్గుపాటి
సోషల్ మీడియాలో మహేశ్ బాబు యాక్టివ్ గా ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రతీ సినిమా గురించి చర్చిస్తూ ట్విట్టర్లో పోస్టులు పెడుతుంటారు. ఇందులో భాగంగా ఆయన ‘పుష్ప’ సినిమా గురించి ఓ పోస్టు పెట్టారు. ఆ సినిమా బృందాన్ని అభినందిస్తూ ట్యాగ్ చేశాడు. అయితే ఆ సినీ బృందంలోని సభ్యుల్లో కొంత మంది మాత్రమే మహేశ్ కు రిప్లై ఇచ్చారు. ముఖ్యంగా అల్లు అర్జున్ మహేశ్ ట్వీట్ ను పట్టించుకోలేదు. అఖండ సినిమా బృందాన్ని విషెస్ చేస్తూ ట్వీట్ చేశారు. కానీ అక్కడా ఇదే సమస్య. ఇక ఇటీవల బ్లాక్ బస్టర్ సాధించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా బృందాన్ని కూడా మహేశ్ పేరు పేరున అభినందించారు. కానీ ఆ సినిమా హీరులు కానీ.. నటులు గానీ ఎవరూ స్పందించలేదు.

తెలుగులోనే కాకుండా మహేశ్ కు తమిళంలోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన సినిమాలు తమిళంలోకి అనువదిస్తారు. అంతేందుకు తమిళ డైరెక్టర్ మురుగుదాస్ తీసిన ‘స్పైడర్’ తెలుగులో ఆదరించకపోయినా కోలీవుడ్ లో మహేశ్ కోసం చాలా మంది చూశారు. దీంతో ఆయన తమిళ సినీ ఇండస్ట్రీతో సంబంధాలు ఉంటాయి. దీంతో ఆయన అక్కడి సినీ నటులను అభినందిస్తారు. తాజాగా ఆయన ‘బీస్ట్’ సినిమా బృందాన్ని అభినందించారు. కానీ ఒక్కరూ కూడా రిప్లై ఇవ్వలేదు. ప్రతీ పోస్టుకు స్పందించే అనిరుధ్ కూడా మహేశ్ పోస్టును పట్టించుకోలేదు. ఇక తాజాగా విడుదలయిన విక్రమ్ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది.
దీంతో అందరినీ పలకరించే మహేశ్ ను ఎదుటి వారు పట్టించుకోకపోవడంపై మహేశ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ‘ఇండస్ట్రీలో మరీ అంత మంచితనం పనికి రాదన్నా’ అంటూ ట్యాగు చేసి పోస్టులు పెడుతున్నారు. ఓ స్టార్ హీరో మరో నటులను అభినందించినప్పుడు కనీసం రిప్లై ఇవ్వకపోతే వేరే రకంగా ఉంటుంది. దీంతో టాలీవుడ్లో కొత్త చర్చ మొదలైంది. అయితే ఫ్యూచర్లో మహేశ్ తన మంచితనాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తారా..? లేదా..? అనేది చూడాలి.
Also Read:My Village Show Gangavva: వామ్మో గంగవ్వ.. రేంజ్ మామూలుగా లేదుగా
[…] […]