Green Apple Awards 2023: జాతీయ స్థాయిలో తెలంగాణ పల్లెలు పట్టణాలు అనేక అవార్డులు సాధిస్తున్నాయి. స్వచ్ఛస్వర్వేక్షణ్, స్మార్ట్ సిటీ కేటరిగీల్లో ఏటా జాతీయ స్థాయిలో ఇస్తున్న అవార్డుల్లో అధికంగా తెలంగాణలోని గ్రామాలు, మండలాలు, జిల్లాలతోపాటు, మున్సిపాలిటీలు గెలుచుకుంటున్నారు. తాజాగా తెలంగాణ ఖ్యాతి అంతర్జాతీయస్థాయికి ఎదిగింది. అండన్ వేదికపై తెలంగాణ కీర్తిపతాక రెపరెపలాడింది. నిర్మాణరంగంలో ఐదు అంతర్జాతీయ అవార్డులను తెలంగాణ సొంతం చేసుకుంది. ఈమేరకు లండన్ గ్రీన్ ఆర్గనైజేషన్ సంస్థ జూన్ 14న (బుధవారం) ప్రకటించింది.
అవార్డులు ఇవీ..
తెలంగాణ కొత్త సచివాలయానికి అంతర్జాతీయ అవార్డు దక్కింది. బ్యూటిఫుల్ వర్క స్పేస్ బిల్డింగ్ కేటగిరీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియేట్‌కు అంతర్జాతీయ అవార్డు దక్కింది. సుమారు 1600 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సచివాలయాన్ని గతనెలలోనే సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. వాస్తు దోషం సాకుతో 9 ఏళ్లు సెక్రటేరియేట్‌కు రాకుండానే పాలన సాగించిన సీఎం కేసీఆర్.. మూడేళ్ల క్రితం పాత సచివాలయం కూల్చి నూతన నిర్మాణం చేపట్టారు. ఆధునిక శైలిలో, అంతర్జాతీయ ప్రమాణాలతో రాజస్థాన్‌కు చెందిన ఎర్రరాతితో దీనిని నిర్మించారు.
మొజంజాహి మార్కెట్‌కు..
ఇక లండన్‌లోని గ్రీన్ ఆర్గనైజేషన్ హైదరాబాద్‌లోని మొజంజాహి మార్కెట్‌కు కూడా అవార్డు ప్రకటించింది. హెరిటేజ్ విభాగంలో దీనిని ఎంపిక చేసింది. నిజాం కాలం నుంచి ఉన్న మొజంజాహి మార్కెట్ ఇప్పటికీ కొనసాగుతోంది. దీంతో దీనిని వారసత్వ సంపదగా లండన్ సంస్థ గుర్తించి అవార్డు ప్రకటించింది.
భిన్నమైన నిర్మాణంగా కేబుల బ్రిడ్జి..
హైదరాబాద్‌లోని దుర్గం చెరువుపై తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలత నిర్మించిన కేబుల్ బ్రిడ్జికి కూడా లండన్‌లోని గ్రీన్ ఆర్గనైజేషన్ అవార్డు దక్కింది. భిన్నమైన నిర్మాణ శైలి కేటగిరీలో తెలంగాణ కేబుల బ్రిడ్జికి అవార్డు దక్కింది.
కమాండ్ కంట్రోల్‌కు ప్రత్యేక కేటరిగీ అవార్డు..
తెలంగాణలోని నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు నిర్మించిన తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అంతర్జాతీయ అవార్డు దక్కింది. స్పెషల్ ఆఫీస్ కేటరిరీలో లండన్ గ్రీన్ ఆర్గనైజేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అవార్డు దక్కింది. ఈ సెంటర్‌లో తెలంగాణ నిఘా వ్యవస్థ మొత్తం నిక్షిప్తం చేశారు. ఎక్కడ చీమ చిటుక్కుమన్నా కనిపెట్టేలా తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్లను దీనికి అనుసంధానం చేశారు.
అద్భుతమైన నిర్మాణంగా యాదాద్రి…
ఇక తెలంగాణలో అంత్య అద్భుతమైన మతపరమైన నిర్మాణంగా యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి అవార్డు దక్కింది. కేసీఆర్ తెలంగాణలో కాళేశ్వరం తర్వాత అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది యాదాద్రి ఆలయ నిర్మాణానికే. దాదాపు రూ.1,200 కోట్ల రూపాయలతో యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించింది. గతేడాది దీనిని ప్రారంభించారు. ఆలయ ప్రాశస్త్యం ఎక్కడా దెబ్బతినకుండా ఆధునిక శిల్ప శైలి ఉట్టిపడేలా ఆలయం నిర్మించారు. దీంతో మతపరమైన కేటగిరీలో యాదాద్రికి లండర్ గ్రీన్ ఆర్గనైజేషన్ గ్రీన్ యాపిల్ అవార్డు ప్రకటించింది.
ఈ ఐదు అవార్డులను లండన్‌లో ఈనెల 16న ప్రదానం చేయనున్నారు. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రతినిధులు హాజరు కానున్నారు.