PM Modi: మోదీనే రంగంలోకి.. యుద్ధ విమానం నడిపితే ఎట్లా ఉంటుందో తెలుసా? వైరల్‌ వీడియో

బెంగళూరులోని హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హాల్‌)కు శనివారం మోదీ వచ్చారు. దేశీయంగా తయారైన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లో ప్రయాణించారు.

Written By: Raj Shekar, Updated On : November 26, 2023 12:28 pm

PM Modi

Follow us on

PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైనికుడిగా మారాడు.. యుద్ధ విమానం స్వయంగా నడుపుతూ కదనరంగంలోకి దిగారు. సైనియుడి యూనిషాంలో స్టైలిష్‌ లుక్‌తో తేజస్‌ యుద్ధ విమానం నడిపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

బెంగళూరులో..
బెంగళూరులోని హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హాల్‌)కు శనివారం మోదీ వచ్చారు. దేశీయంగా తయారైన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లో ప్రయాణించారు. యుద్ధ విమానంలో దేశ ప్రధాని ప్రయాణించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరులోని హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హాల్‌)కు చెందిన తయారీ యూనిటు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు. పైలట్‌ యూనిఫామ్‌ ధరించి తేజస్‌ యుద్ధ విమానంలో సుమారు 10 నిమిషాలపాటు ప్రయాణించారు. తన యుద్ధవిమాన ప్రయాణం తాలూకు ఫొటోలు, వీడియోలను ఆ తర్వాత ప్రధాని మోదీ సోషల్‌ మీడియా ఎక్స్‌తో స్వయంగా పోస్ట్‌ చేశారు. ‘తేజస్‌లో ప్రయాణం విజయవంతంగా పూర్తయింది. ఈ ప్రయాణ అనుభవం భారతదేశ దేశీయ సామర్థ్యాలపై నమ్మకాన్ని మరింతగా పెంచింది. దేశీయ టెక్నాలజీ, వైమానిక సత్తా, కృషి, అంకితభావం చూస్తే గర్వంగా ఉంది’ అని పేర్కొన్నారు.

ప్రపంచ దేశాలకు దీటుగా..
స్వావలంబనలో ప్రపంచంలోని ఏ దేశంతోనూ భారత్‌ తీసిపోదని మోదీ పేర్కొన్నారు. భారతీయులుగా మనందరం ఈ విషయంలో భారత వాయుసేన, డీఆర్డీవో, హాల్‌ను అభినందించాలని మోదీ తన ట్వీట్‌లో కోరారు. విమాన ప్రయాణం తర్వాత హాల్‌లోని తయారీ కేంద్రం పనితీరును ఆయన స్వయంగా పర్యవేక్షించారు.

తేలికపాటి యుద్ధ విమానాల తయారీ..
ఇదిలా ఉండగా హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ సంస్థ.. తేలికపాటి తేజస్‌ యుద్ధ విమానాలను ప్రస్తుతం తయారు చేస్తుంది. లైట్‌ కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌గా వాటికి గుర్తింపు ఉంది. అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్‌ సంస్థతో హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ సంస్థ ఒప్పందం చేసుకుంది. తేజస్‌ యుద్ధ విమానాలకు చెందిన మాక్‌–3 ఇంజిన్లను హెచ్‌ఏఎల్‌ తయారు చేస్తోంది.