Pawan Kalyan : జనసేనను ప్రజారాజ్యం కానివ్వను.. పవన్ నోట భావోద్వేగ మాట.. వైరల్

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమ నేపథ్యంలో జనసేన గురువారం విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. విశాఖ ఉక్కు మద్దతుగా పవన్ చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. విశాఖ స్టీల్ ఉద్యమానికి జనసేన చివరి వరకు అండగా నిలుస్తుందని పవన్ స్పష్టం చేశారు.

Written By: NARESH, Updated On : December 7, 2023 8:52 pm

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan : ఏపీలో జనసేనది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. సరిగ్గా రాష్ట్ర విభజన ముందు జనసేన ఆవిర్భవించింది. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి, కేంద్రంలో బిజెపికి మద్దతు తెలిపింది. రాష్ట్రంలో సీనియార్టీని గౌరవిస్తూ చంద్రబాబును, కేంద్రంలో కొత్త నాయకత్వాన్ని ఆహ్వానిస్తూ నరేంద్ర మోదీకి మద్దతు తెలుపుతూ పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అప్పటినుంచి జియాప జయాలను లెక్కచేయకుండా జనసేనను ఒక క్రియాశీలక రాజకీయ శక్తిగా చూపించడంలో పవన్ సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించారు. ఈ క్రమంలో జనసేన పై అధికార వైసిపి విషప్రచారం చేస్తోంది. దానిని తిప్పికొట్టే క్రమంలో పవన్ భావోద్వేగ ప్రకటనను జారీ చేశారు. ప్రజారాజ్యం విషయంలో జరిగిన తప్పిదాన్ని మరోసారి పునరావృత్తం చేయనని స్పష్టం చేశారు. చివరివరకు పోరాడుతానని తేల్చి చెప్పారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమ నేపథ్యంలో జనసేన గురువారం విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. విశాఖ ఉక్కు మద్దతుగా పవన్ చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. విశాఖ స్టీల్ ఉద్యమానికి జనసేన చివరి వరకు అండగా నిలుస్తుందని పవన్ స్పష్టం చేశారు. తాను ఓట్ల రాజకీయం చేయలేదని.. మార్పు కోసమే ప్రయత్నిస్తున్నానని పవన్ తేల్చి చెప్పారు. విశాఖ ఉక్కు అంశం భావోద్వేగంతో కూడినదని.. ఎందరో త్యాగాధనుల పుణ్యఫలితంగా ఏర్పడిన విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన గురుతుర బాధ్యత ప్రతి రాజకీయ పార్టీ పై ఉందని పవన్ తేల్చి చెప్పారు. అధికారం కోసం ఓట్లు అడగనని.. మార్పు కోసమే అడుగుతానని.. ఉత్తరాంధ్ర చైతన్యం ఉన్న నేల అని పవన్ స్పష్టం చేయడం విశేషం. ప్రస్తుత రాజకీయాల్లో ఓ పార్టీని నడపడం కష్టమని.. కానీ తాను మాత్రం ప్రజల కోసమే పార్టీని నడుపుతున్న విషయాన్ని పవన్ గుర్తు చేశారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధి జనసేన ధ్యేయం అని పవన్ మరోసారి స్పష్టం చేశారు. ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడితేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమని పవన్ తేల్చి చెప్పారు. ఉత్తరాంధ్రలో 24 బీసీ కులాలను తెలంగాణలో గుర్తించని వైనాన్ని ప్రస్తావించారు. ఈ విషయంలో వైసీపీ నేతలు ఆశించిన స్థాయిలో పని చేయలేదని చెప్పుకొచ్చారు. కెసిఆర్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. అన్ని వర్గాల సంక్షేమమే జనసేన ధ్యేయమని ప్రకటించారు. జనసేనకు అండగా నిలబడితే స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తానని పవన్ స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో 22 ఎంపీ స్థానాలను వైసీపీకి అప్పగిస్తే.. చేసేది ఇదేనా అని ప్రశ్నించారు. తనకు సంపూర్ణ మద్దతు తెలిపితే ఈ రాష్ట్రం కోసం తాను అన్ని విధాలా పోరాటం చేసి ఉండే వాడినని పవన్ తేల్చి చెప్పడం విశేషం.

ప్రజల కోసం కష్టపడితే తనకు గుర్తింపు లభించలేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం ఎన్నో రకాలుగా అపజయాలు ఎదుర్కొన్నానని స్పష్టం చేశారు. ఎన్నాళ్లకు ఈ రాష్ట్ర ప్రజలు తనపై ప్రేమ చూపుతుండడాన్ని సంతోషంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో టిడిపి జనసేన ప్రభుత్వం వస్తేనే ప్రజలు సుఖంగా ఉంటారనిస్పష్టం చేశారు. బాధ్యతగా మాట్లాడే వారు ఉంటేనే వ్యవస్థలు సరిగా పనిచేస్తాయని పవన్ పేర్కొనడం విశేషం. మొత్తానికైతే పవన్ తొలిసారిగా భావోద్వేగ ప్రకటనలు జారీ చేయడం విశేషం. బిజెపి సహకారంతోఏపీని టిడిపి జనసేన కూటమి ప్రభుత్వంఅన్ని విధాలా అభివృద్ధి చేస్తుందని పవన్ చెప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ తాజా ప్రకటనతో టిడిపి,జనసేన కూ టమిలోకి బిజెపి వస్తుందని సంకేతాలు ఇవ్వడం విశేషం.