Site icon OkTelugu

BRO Teaser : సాయిధరమ్ తేజ్ ను ఏడిపించిన పవన్ కళ్యాణ్.. అల్లరే అల్లరి పో!

BRO Teaser : ప్రతి మనిషి జీవితంలో టైం చాలా ఇంపార్టెంట్. టైం చాలా విలువైనది. కోల్పోతే తిరిగిరానిది. బ్రో సినిమాకు ప్రధాన కాన్సెప్ట్ అదే. మనిషి జీవితానికి సమయానికి లింక్ చేసి సోషియో ఫాంటసీ అంశాలతో బ్రో మూవీ తెరకెక్కించారని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ఇది వినోదయ సితం రీమేక్. ఒరిజినల్ లో సముద్రఖని, తంబి రామయ్య నటించారు. అదే పాత్రలు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ చేస్తున్నారు. ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్. 

మనిషిలోని భయాలను, బాధలను కామిక్ గా చెప్పే ప్రయత్నం. అదే సమయంలో జీవితం అంటే ఏమిటో చెప్పే సినిమా. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లు కథలో మార్పులు చేర్పులు చేశారు. బ్రో మూవీ టీజర్ నేడు విడుదల కాగా… ఆద్యంతం ఆకట్టుకుంది. మామా అల్లుళ్ళ సరదాలు టీజర్ కి హైలెట్ గా నిలిచాయి. గజిబిజి గందరగోళంగా ఉన్న సాయి ధరమ్ తేజ్ జీవితంలోకి బ్రో గా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తారు. 
 
అప్పటి నుండి సాయి ధరమ్ జీవితంలో జరిగిన అద్భుతాల సమాహారం అని చెప్పొచ్చు. టీజర్లో పవన్ సాయి ధరమ్ తేజ్ ని ఓ ఆటాడుకున్నాడు. పవన్ కళ్యాణ్ కాంఫిడెన్స్, సాయి ధరమ్ తేజ్ కంగారు టీజర్ కి హైలెట్. భయపెట్టకు చిన్న పిల్లాడ్ని’ బ్రో అని సాయి ధరమ్ చెప్పగా, పవన్ కళ్యాణ్ సెటైరికల్ గా ఓ నిట్టూర్పు ఇస్తాడు. కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు పక్కనే ఉన్న సాయి ధరమ్ తేజ్ తో పవన్ ‘సినిమాలు ఎక్కువ చూస్తావేంట్రా నువ్వూ’ అని చెప్పడం బాగుంది. 
 
సాయి ధరమ్ భయాలతో ఆదుకున్న పవన్ కళ్యాణ్ అల్లరి అలరించింది. రేపు థియేటర్స్ లో వీరిద్దరి కాంబో అద్భుతంగా పేలనుందని అర్థం అవుతుంది. ఒక నిమిషానికిపైగా ఉన్న  టీజర్ మెప్పించింది. దర్శకుడు సముద్ర ఖని బ్రో చిత్రాన్ని తెరకెక్కించారు. స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ త్రివిక్రమ్ సమకూర్చారు. థమన్ మ్యూజిక్ అందించారు. పీపుల్స్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. జులై 28న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.    

Exit mobile version