https://oktelugu.com/

Neeraj Chopra: చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. భారత్‌కు స్వర్ణం అందించాడు

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ లో భాగంగా ఆదివారం హంగేరిలోని బూపెస్ట్ లో ఫైనల్ పోటీలను నిర్వహించారు. ఇందులో నీరజ్ చోప్రా జావెలిన్ ను 88.17 మీటర్లు విసిర నెంబర్ వన్ స్థానంలో నిలిచారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 28, 2023 9:14 am
    Neeraj Chopra

    Neeraj Chopra

    Follow us on

    Neeraj Chopra: భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా మరో ఘనత సాధించాడు. గతంలో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన ఆయన తాజాగా ప్రపంచ ఆథ్లెటిక్ష్ పోటీల్లోనూ అజేయుడిగా నిలిచాడు. ఈ కాంపిటీషన్ అతను అత్యుత్తమ ప్రదర్శన చూపి ఇక్కడ కూడా బంగారు పతకాన్ని తీసుకొచ్చాడు. దీంతో అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐదు సార్లు జావెలిన్ త్రో చేసిన నీరజ్ మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాడు. అయితే ఆ తరువాత నుంచి వరుసగా నాలుగు సార్లు విసిరి లక్ష్యాన్ని ఛేదించాడు. ఈ పోటీల్లో భారత్ మొదటి స్థానంలో నిలవగా.. పాకిస్తాన్ కు చెందిన ఆటగాడు రెండోస్థానంలో నిలిచాడు.

    ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ లో భాగంగా ఆదివారం హంగేరిలోని బూపెస్ట్ లో ఫైనల్ పోటీలను నిర్వహించారు. ఇందులో నీరజ్ చోప్రా జావెలిన్ ను 88.17 మీటర్లు విసిర నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. ఈ పోటీలో భాగంగా తొలి ప్రయత్నంలో విఫలమయ్యాడు. రెండో సారి 88.17 మీటర్లు విసిరాడు. మూడోసారి 86.32 మీట్లు, నాలుగోసారి 84.64 మీటర్లు, ఐదోసారి 87.73 మీటర్లు, ఆరోసారి 83.98 మీటర్లు త్రో చేశాడు. మొత్తంగా 88.17 మీటర్లు విసిరి విజేతగా నిలిచాడు.నీరజ్ చోప్రాతో పాటు పోటీలో పాల్గొన్న కిషన్ జెనా 84.77 మీటర్లు విసిరి ఐదో స్థానంలో నిలిచాడు.

    నీరజ్ చోప్రా ఫస్ట్ ప్లేసులో నిలిచి గోల్డ్ మెడల్ సాధించగా.. పాకిస్తాన్ కు చెందిన క్రీడాకారుడు అర్షద్ నదీమ్ 87.32 మీటర్లు త్రో చేసి రెండోస్థానంలో నిలిచాడు. దీంతో అతడు రజతం అందుకున్నాడు. రెక్ రిపబ్లిక్ కు చెందిన జాకట్ వడ్లెచ్ 86.67 మీటర్లు విసిరి మూడోస్థానంలో నిలిచి బ్రౌంజ్ మెడల్ అందుకున్నాడు. ఇక పురుషుల 4×400 మీటర్ల రిలే విభాగంలో భారత జట్టు 2.59.92 సెకన్లతో ముగిసి ఐదోస్థానానికి పరిమితం అయింది. అమెరికా మాత్రం 2.75.31 వద్ద గోల్డ్ మెడల్ సాధించింది. మహిళల 3000 స్టీపుల్ చేజ్ విభాగంలో భారత్ నుంచి పరుల్ చౌదరి 11వ స్థానంలో చిలిచారు.

    నీరజ్ చోప్రా 2021లో జరిగిన ఒలంపిక్స్ 88.07 మీటర్లు విసిరి స్వర్ణం గెలుచుకొని వచ్చాడు. ఇప్పుడు 88.17 మీటర్ల దూరం పెంచాడు. దీంతో ముందు ముందు మరిన్న ప్రయోగాలు చేసే అవకాశం ఉందని క్రీడాభిమానులు అంటున్నారు. నీరజ్ చోప్రా స్వర్ణం సాధించడంపై దేశ వ్యాప్తంగా ఆయనకు ప్రశంసలు దక్కుతున్నాయి. అథ్లెటిక్స్ విభాగంలో స్వర్ణపతకాలు సాధిస్తున్న ఆయనను ప్రముఖులు అభినందిస్తున్నారు.