NBK X PSPK Power Teaser : పవర్ స్టార్ పవర్ ప్యాక్డ్ ఇంటర్వ్యూకు రంగం సిద్ధమైంది. అన్ స్టాపబుల్ అంటూ బాలయ్య బాబు ఓటీటీలో మొదలుపెట్టిన ఈ షో గ్రాండ్ హిట్ అయ్యింది. ఇప్పటికే ప్రభాస్ లాంటి స్టార్ హీరో వచ్చిన ఎపిసోడ్ గూస్ బాంబ్స్ తెప్పించి ఆహా ఓటీటీని స్ట్రక్అయ్యేలా చేసింది. ఇప్పుడు పవన్ ఎపిసోడ్ అంతకుమించి అనేలా ఉంది. తాజాగా విడుదలైన ట్రైలర్ గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉంది.

కొట్లాడి మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘అన్ స్థాపబుల్ విత్ NBK ‘ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఈరోజు రాత్రి 8 గంటలకు విడుదలైంది.. ఈ ప్రోమో కి ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ ని దక్కించుకుంది.. పవన్ కళ్యాణ్ – బాలకృష్ణ బయట చాలాసార్లు కలిశారు కానీ.. ఎప్పుడూ కూడా వీళ్లిదరు ఇలా మాట్లాడుకోవడం మనం చూడలేదు..రాజకీయాల్లో ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు.. అలాంటి వీళ్లిద్దరి మధ్య ఇంత సాన్నిహిత్యం ఉందని ఈ ప్రోమో చూసిన తర్వాతే అర్థం అయ్యింది.. ఈ నెల 26 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ ప్రోమో కి సంబంధించి హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ప్రోమో లో బాలయ్య స్వయంగా పవన్ కళ్యాణ్ ని చాలా ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగాడు.. 2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఓటమి గురించి బాలయ్య అడిగిన ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.. బాలయ్య మాట్లాడుతూ ‘ఈ రాష్ట్రం లో నీకు ఫ్యాన్ కానీ వాడు లేదు.. కానీ ఆ అభిమానం , ప్రేమ ఓట్లుగా ఎందుకు మారలేదు’ అని అడుగుతాడు.. అప్పుడు పవన్ కళ్యాణ్ సైలెంట్ అవుతాడు.. ఏమి మాట్లాడాడు అనేది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే..
నువ్వు అమితంగా ఆరాధించే చిరంజీవి నుంచి తీసుకోవాల్సింది ఏంటి? వదిలేయాల్సింది ఏంటి? అన్నది చెప్పాలని బాలయ్య స్వయంగా పవన్ ను అడుగుతాడు. దీనికి పవన్ ఏం చెప్పాడన్నది ఆసక్తి రేపుతోంది.
ఈ ఎపిసోడ్ లో చాలా హైలైట్స్ ఉన్నాయి.. పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఈ షో లో పాల్గొన్నాడు.. మధ్యలో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ -రామ్ చరణ్ కి కాల్ చేస్తాడు..ఆ తర్వాత బాలయ్య కొడుకు కూడా ఈ షో లో పాల్గొని పవన్ కళ్యాణ్ తో ఫొటో దిగి వెళ్తాడు.. అలా చాలా సర్ప్రైజ్ లు ఈ ఎపిసోడ్ లో ఉన్నాయి
https://www.youtube.com/watch?v=NhadAnD5aqI