Narendra Modi : ఎంత గొప్ప మనసు.. అంతటి మోడీ హైదరాబాద్ వచ్చి సారీ చెప్పాడు..

ఎన్నో ధైర్యవంతమైన చట్టాలు, నిర్ణయాలు తీసుకున్న మోడీ ఈ ఎస్సీ వర్గీకరణను తన హయాంలో చేస్తే దళితుల ఆరాధ్య దైవంగా మారడం ఖాయంగా చెప్పొచ్చు.

Written By: NARESH, Updated On : November 11, 2023 10:22 pm
Follow us on

Narendra Modi : దేశానికి ప్రధాని ఆయన.. ప్రపంచంలోనే గొప్ప నేత.. ఏ దేశాధ్యక్షుడు కూడా మోడీకి దరిదాపుల్లో లేరు. అమెరికా అధ్యక్షుడి ప్రజాదరణ కూడా కేవలం 40 శాతమే.. అదే మన మోడీకి 70 శాతం ప్రజాదరణ ఉంది. అందుకే ప్రపంచంలోనే స్ట్రాంగ్ లీడర్ గా మోడీ అవతరించారు. ప్రపంచాన్ని శాసిస్తున్నాడు. భారత్ ప్రతిష్టను పెంచుతున్నాడు.

అయితే అంతటి మోడీ హైదరాబాద్ వచ్చి సారీ చెప్పాడు.. హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ‘మాదిగల విశ్వరూప మహాసభ’లో మోడీ పాల్గొని మాట్లాడారు.

తాను దళిత వర్గాలకు క్షమాపణ చెప్పడానికే మాదిగల సభకు వచ్చానని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు దళితులను మోసం చేశాయని.. మాదిగల సమావేశానికి ఏ ప్రధాని హాజరు కాలేదని ఆయన గుర్తు చేశారు. మీ నుంచి తాను ఏదో ఆశించి ఇక్కడికి రాలేదని మోడీ స్పష్టం చేశారు.

దళితుల్లో మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై మోడీ ఈ సారీ చెప్పారు. అనాదిగా ప్రభుత్వాలు వర్గీకరణ చేయకుండా వారిని మోసం చేస్తున్నాయని.. తన ప్రభుత్వం ఇది జరగకుండా న్యాయచిక్కులు రావడంతో మోడీ గొప్ప మనసులో ఈ సారీ చెప్పడం విశేషం. అంత పెద్ద తన తప్పు ఒప్పుకొని మాదిగలకు చెప్పిన ఈ సారీ ఇప్పుడు సంచలనమైంది. ఖచ్చితంగా దళిత ఓటు బ్యాంక్ ఈ దెబ్బకు బీజేపీకి అనుకూలంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

ఎన్నో ధైర్యవంతమైన చట్టాలు, నిర్ణయాలు తీసుకున్న మోడీ ఈ ఎస్సీ వర్గీకరణను తన హయాంలో చేస్తే దళితుల ఆరాధ్య దైవంగా మారడం ఖాయంగా చెప్పొచ్చు.