Site icon OkTelugu

Revanth Reddy : కాళేశ్వరం లొసుగులు జనం ముందుకు లాగటం స్వాగతిద్దాం

PM Modi vs Revanth Reddy

Revanth Reddy : రేవంత్ రెడ్డి నాగపూర్ కాంగ్రెస్ సభలో స్థాయికి మించి మాట్లాడాడు. ప్రపంచం మొత్తం పొగుడుతున్న మోడీ స్థాయి గురించి నాగపూర్ లో రేవంత్ రెడ్డి మాట్లాడడం విమర్శలకు తావిచ్చింది. పట్టుమని నెలరోజులు కూడా సీఎం గా లేని రేవంత్ రెడ్డి.. అప్పుడే రాహుల్ మెప్పు కోసం మోడీపై దారుణ కామెంట్స్ చేయడం ఎంత వరకూ కరెక్ట్.. ప్రపంచంలోనే పాపులర్ నేత అయిన మోడీని పట్టుకొని ఇష్టమొచ్చినట్టు తిట్టడానికి కాదన్న విషయం గ్రహించాలి.

కేసీఆర్ కుటుంబ అవినీతిని బయటపెట్టు.. ప్రజలకు దగ్గర కావడానికి ప్రయత్నించు.. మోడీని విమర్శిస్తే ప్రజలకు రేవంత్ దూరం కావడం ఖాయం. ఇప్పటికైనా రాష్ట్రం కోసం ఆలోచించి సరిగ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది.

కాళేశ్వరంలోని లోటుపాట్లు, అవినీతి, వృథా ప్రయాసను తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు బయటపెట్టడం అభినందనీయం.. లక్షా 20వేల కోట్ల ఈ ప్రాజెక్ట్ లో లోటుపాట్లపై మంత్రులు బయటపెట్టి మంచి పని చేశారు.

కాళేశ్వరం లొసుగులు జనం ముందుకు లాగటం స్వాగతిద్దాం.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు

Exit mobile version