Jagan Varma Pawan: రాంగోపాల్ వర్మ అంటే బురద.. అందులో కాలు పెడితే ముందు నీకే బురద అంటుతుంది. అవతలివారిపై చల్లడం తర్వాత ముందు నీ బురద నువ్వు కడుక్కోవాలి కాదా?.. ఇప్పుడు అదే జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత వివాదాస్పదుడు ఎవరయ్యా అంటే ఠక్కున సమాధానం వచ్చే పేరు వర్మ. అలాంటి వర్మ సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఫేడ్ అవుట్ అయిపోయాడు. ఎప్పుడో ‘శివ’తో టాలీవుడ్ ను షేక్ చేసిన వర్మలో క్రియేటివిటీ మొత్తం చచ్చిపోయి ఇప్పుడు బూతు సినిమాలు తీసుకునే స్థితికి దిగజారాడు. ముంబైలో హిందీ సినిమాలు వరుస ప్లాప్ కావడంతో హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యాడు. ఇప్పుడు ఏ హీరో కూడా వర్మతో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపకపోవడంతో ఏవో శృంగార చిత్రాలు తీసి అభాసుపాలువుతున్నారు.

అలాంటి వర్మను ఏపీ సీఎం జగన్ పిలిచి మరీ సినిమాలు తీయమని కోరడం అంతకంటే మూర్ఖత్వం ఉండదనడంలో ఎలాంటి సందేహం లేదు. వర్మలో సినిమాలు తీసి మెప్పించే రోజులు ఎన్నడో పోయాయి. ఏదో బయోపిక్ లు అంటూతీసి అప్పట్లో హిట్ కొట్టాడు. ఇప్పుడా బయోపిక్ లు కూడా ఆడడం లేదు. మొన్నటికి మొన్న కొండా సురేఖ దంపతులపై సినిమా తీస్తే కనీసం ఒక్కరోజు కూడా ఆడలేదు. అసలా సినిమా ఎప్పుడు విడుదలైందో ఎప్పుడు పోయిందో కూడా జనాలకు తెలియదు. అలాంటి వర్మను పిలిచి మరీ సినిమాలు తీయమన్న జగన్ కు ఇప్పుడు ఇదే గతి పట్టడం ఖాయం.
వర్మ సినిమాలు తీస్తే ఎంతలేదన్న 5 కోట్ల దాకా అయిాన ఛార్జ్ చేస్తాడు. ఆ డబ్బులు పోయి సినిమా ఆడక.. ప్రతిపక్షాలు, సోషల్ మీడియాలో పరువు పోగొట్టుకోవడం తప్ప మరొకటి ఉండదు. స్టప్ ఉన్న దర్శకులతో ప్రయోగాలు చేస్తే ఉన్నపరువు ఉంటుంది. కానీ వర్మతో తీస్తే తీసే వారి పరువే పోతుంది.
ఇప్పటికే జగన్ పెద్ద తప్పు చేశాడు. పవన్ కళ్యాణ్ పై పగ సాధించేందుకు వర్మను పిలిచి సినిమా తీయమన్నాడు. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ, అల్లు అరవింద్ ను ఎదురించి సినిమా తీయగల దమ్ము ఎవరికి లేదు. తీసినా మిగతా అందరితోనూ వారు మేనేజ్ చేసి థియేటర్లు దక్కకుండా చేయడం.. కనీసం థియేటర్ రిలీజ్ కూడా కానివ్వకుండా చేసేంత మేనేజ్ మెంట్ వారి సొంతం. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా వర్మ సినిమా తీసి జగన్ కు ఇచ్చినా దాన్ని జనంలోకి తీసుకెళ్లడం కష్టమే. వర్మ ఎలాగూ ప్రచారం చేయడు. కేవలం ఆ డబ్బులు లోపలేసుకొని జగన్ ముఖాన ఆ సినిమా కొడుతాడు. ఇక వర్మ సినిమా అంటే ఒక్క ప్రేక్షకులు కూడా రూ.100 పెట్టి థియేటర్ కు రాడు. సో ఏ రకంగా చూసినా జగన్ మునిగినట్టే. పవన్ పై ప్రతీకారంతో తీసే ఈ సినిమా విషయంలో జగన్ విలన్ గా ప్రొజెక్ట్ అవుతాడు. ప్రజాపరిపాలన చేయమంటే సినిమాలు తీస్తావా? అని జనాలు తిస్కరించే పరిస్థితి. ఏతావాతా పవన్ పై సినిమా జగన్ కు డ్యామేజ్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వర్మతో వెలితే కాలేది పవన్ కు కాదని.. జగన్ కేనన్న విషయాన్ని మరవకూడదు.