Hi Nanna Review: హాయ్ నాన్న ఫుల్ మూవీ రివ్యూ…

దసర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు హాయ్ నాన్న అనే సినిమాతో మరో వైవిద్యమైన కథాంశాన్ని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఇవాళ్ల రిలీజ్ అయింది ఈ సినిమాకి సంబంధించిన విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Written By: Gopi, Updated On : December 7, 2023 12:18 pm

Hi Nanna

Follow us on

Hi Nanna: సినిమా ఇండస్ట్రీలో నాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన తీసిన సినిమాల్లో ఆయన నటన చాలా నాచురల్ గా ఉంటుంది.అందుకే ఆయన నాచురల్ స్టార్ అనే బిరుదుని కూడా సొంతం చేసుకున్నాడు. అలాంటి నటుడు సినిమా సినిమాకి వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ పాత్ర పాత్రకి మధ్య వేరియేషన్ ని చూపిస్తూ ప్రేక్షకులను కట్టి పడేస్తున్నాడు.ఇక ఈ సంవత్సరం ఇప్పటికే దసర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు హాయ్ నాన్న అనే సినిమాతో మరో వైవిద్యమైన కథాంశాన్ని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఇవాళ్ల రిలీజ్ అయింది ఈ సినిమాకి సంబంధించిన విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం… ముఖ్యంగా ఈ సినిమా ఎలా ఉంది, నాని కి మరొక హిట్ పడినట్టేనా, లేదా అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ముందుగా ఈ కథ విషయానికి వస్తే నానికి పెళ్లి అయి ఒక పాప కూడా ఉంటుంది.ఇక స్వతహాగా ఫోటోగ్రాఫర్ అయిన నాని అనుకోకుండా మృణల్ తాకుర్ ని కలిస్తాడు వాళ్లిద్దరి మధ్య ప్రేమ అనేది చిగురిస్తుంది. అయితే ఆ పాప మాత్రం వాళ్ల అమ్మకి దూరం గా ఉండటాన్ని ఇష్టపడదు ఎప్పుడు అమ్మ గురించి తలుచుకొని పాప ఏడుస్తుంది. అయితే వాళ్ళ అమ్మ గుర్తులను దూరం చేసి తనతోపాటు ఉంచుకోవాలనే ఉద్దేశ్యం లో నాని ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలో ఆ పాప వాళ్ళ అమ్మ ని కలుస్తుందా,అసలు నాని తన భార్య తో విడిపోవడానికి గల కారణాలు ఏంటి, ఆ పాప నుంచి వాళ్ళ అమ్మ విడిపోవడానికి గల కారణాలేంటి అలాగే మృణాల్ తాకూర్ కి, నానికి మధ్య చిగురించిన ప్రేమ అనేది చివర్లో కలుస్తుందా లేదా అనే క్యూరియాసిటీని రేకెత్తించే కథతో ఈ సినిమా ని తీశాడు దర్శకుడు అయితే వీటన్నింటికీ సమాధానం దొరకాలంటే మాత్రం మీరు ఈ సినిమా చూడాల్సిందే…

ఇక కథ విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాలో దర్శకుడు ఎంచుకున్న కథ బావుంది. ఒక డీసెంట్ క్లాసికల్ సినిమాగా తెరకెక్కించే స్కోప్ ఉన్న కథనైతే తీసుకున్నాడు. ఈ సినిమా కథని మనం ఇంతకు ముందు చాలాసార్లు తెలుగు సినిమాల్లో చూసాం…క్యారెక్టర్ కి క్యారెక్టర్ కి మధ్య ఉన్న ఇంటిమాసిని చాలా బాగా తీసి సక్సెస్ కొట్టిన సినిమాలు చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ మాత్రం ఇప్పుడు చిన్న చిన్న ఎమోషన్స్ ని బాగా పండిస్తూ ఒకే ప్లాట్ లో సినిమాని తీసుకెళ్లాడు. అతని మేకింగ్ అనేది సినిమాకి కొంతవరకు ప్లస్ అయినప్పటికీ కథ అనేది ఒకే ప్లాట్ లో ఉండడం అనేది పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఎందుకంటే దర్శకుడు తను అనుకున్న కథని అనుకున్నట్టుగా స్క్రీన్ పైన ప్రజెంట్ చేసినట్టు అతని కనిపించినప్పటికి ఇంకా కథని డెవలప్ చేసి మేకింగ్ లో ఇంకాస్త పట్టు సాధిస్తే బాగుండేది. కథలో కూడా కొన్ని లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. అన్ని సీన్లు లకి ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ గా రాసుకుంటే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. ఉదాహరణకి ఒక సీన్ లో నాని వాళ్ళ అమ్మని మర్చిపోవడానికి పాప కి కొన్ని మాటలు చెప్తూ ఉంటాడు వాటిలో ఇంట్టిమాసి అనేది పీక్స్ లెవల్లో క్రియేట్ చేయొచ్చు. కానీ డైరెక్టర్ దానిమీద ఎక్కువగా ఫోకస్ చేయకుండా సీన్ కి సీన్ కి మధ్య కనెక్షన్ ఉందా లేదా అని పాయింట్ మీదని ఎక్కువ ఫోకస్ చేశాడు. అదొక్కటే చూసుకున్నాడు తప్ప సీన్ లో డెప్త్ ఉందా లేదా దాని ట్రీట్మెంట్ కరెక్ట్ గా ఉందా ఎగ్జిక్యూషన్ అనేది కరెక్ట్ గా నడుస్తుందా అనే దానిపైన అసలు శ్రద్ధ పెట్టలేదు.ఇక నాని సినిమాలను ఒక్కసారి అయితే చూడొచ్చు అని అనిపిస్తుంది. ఈ సినిమా ఒక్కసారి థియేటర్ కెళ్ళి చూడొచ్చు… కానీ నాని సినిమాల్లో కొన్ని సినిమాలు మాత్రం 2,3 సార్లు చూసేలా ఉంటాయి వాటిలో అలా మొదలైంది, ఈగ లాంటి సినిమాలు రిపీటెడ్ గా ఆడియన్స్ చూసే విధంగా ఉంటాయి. కానీ ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు అన్న రేంజ్ లో ఉంది తప్ప మరి రిపిటెడ్ చూసేంత నైతే ఇందులో ఏమి లేదు…నాని ఇంతకుముందు చేసిన నిన్ను కోరి సినిమా అనేది ఒక ఫీల్ గుడ్ మూవీ గా నిలిచిపోయింది.

అలాంటి అటెంప్ట్ లు చేయడానికి నాని ఎప్పుడు ముందు ఉంటాడు.ఇక ఇది కూడా అలాంటి ఒక అటెంప్ట్ అనే నాని అనుకున్నాడు. కానీ డైరెక్టర్ చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల ఈ సినిమా అనేది హై రేంజ్ లో కాకుండా మీడియం రేంజ్ దగ్గరే ఆగిపోయింది…ప్రతి సీన్ లో డెప్త్ ని క్రియేట్ చేయడంలో కొంతవరకు తడబడ్డాడు ప్రతి దీన్ని రాన్ డాం గా నడిపించాడు తప్ప అందులో ఉన్న సోల్ మాత్రం మిస్ అయింది.ప్రతి సీన్ ని రాసుకున్న వే లో కరెక్ట్ గా జస్టిఫై చేయలేకపోయాడు…. డైరెక్టర్ శౌర్యువ్ కొత్త అతను అవ్వడం వల్ల అనుభవం లేని తనం అనేది అతని డైరెక్షన్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది…

ఇక ఆర్టిస్టులు పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఎప్పటిలాగే నాని అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చాడు. నాని ఈ సినిమాలో మరింత పరిణీతి ని కనబరిస్తూ సహజంగా ఇంతకుముందు ఎలాగైతే నటించేవారో ఇప్పుడు అలాగే నడుస్తూ మెప్పించాడు. ఇక మృణాల్ తాకుర్ విషయానికి వస్తే ఆమె తన పాత్ర కి సరైన న్యాయం చేసింది. ఇక ఇంతకుముందు సీతారామం సినిమాలో ఎలాగైతే ప్రేక్షకులను తన నటనతో తన హవా భావాలతో కట్టి పడేసిందో ఈ సినిమాలో కూడా అలాగే మంచి నటన కనబరుస్తూ ప్రేక్షకులను మెప్పించింది…ఇక ప్రియదర్శి కూడా మంచి క్యారెక్టర్ ని ఎంచుకొని ప్రేక్షకులకు అక్కడక్కడ గిలిగింతలు పెడుతూ సినిమాలో ఏదైతే ఒక మూడ్ ని క్రియేట్ చేయలనుకున్నారో దాని కోసం ఆయన కూడా తనవంతు సహాయం అందించాడు. ఇక నాని కూతురుగా నటించిన కైరా ఖన్నా కూడా తనదైన రీతిలో నటించి మెప్పించింది…

ఇక టెక్నికల్ విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ హాషిం అబ్దుల్ వహెబ్ మంచి మ్యూజిక్ ని ఇచ్చాడు.కొన్ని సీన్లు అయితే ఆయన మ్యూజిక్ వల్లే మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్లే ఎమోషనల్ గా ఆ సీన్లు కనెక్ట్ అయ్యాయి. నాని కి, ఆ పాపకి మధ్య ఉన్న ఇంటిమసి హైలెట్ అవ్వడం లో ఈ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా హెల్ప్ అయ్యింది. ఇక సినిమాటోగ్రాఫర్ శానుజాన్ వర్ఘెసి విజువల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా నానిని ఈ సినిమాలో చాలా అందంగా చూపించాడు ఇంతకుముందు ఏ సినిమాలో లేని విధంగా నాని ఈ సినిమాలో చాలా అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను అలరించాడు.అలాగే ప్రతి సీన్ లో కూడా డిఫరెంట్ షాట్స్ ని వాడుతూ సీన్ ని చెడగొట్టకుండా చాలా బాగా చేశాడు. ఇక ఎడిటర్ ప్రవీణ్ ఆంటోనీ కూడా సీన్ లేంతి అవ్వకుండా కరెక్ట్ గా ఎంతవరకు అయితే ఉంచాలో అంతవరకే ఉంచి సీన్ ని కట్ చేశాడు. దానివల్ల ఎడిటింగ్ వర్క్ కూడా చాలా బాగ ప్లస్ అయింది…

ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే
నాని,కైరా, మృణాల్ యాక్టింగ్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
విజువల్స్

ఈ సినిమాలో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటంటే

కథ (ఇప్పటికి చాలా సార్లు ఇలాంటి కథలు చూసాం)
డైరెక్షన్ (చాలా ఔట్ డేటెడ్ గా అనిపించింది)

ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.75/5