Rat Cyborgs: సైన్యం భద్రత కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ముఖ్యమంగా మన దేశ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల దృష్టా మన సైన్యం ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతోంది. విదేశాల నుంచి ఆయుధాలు, యుద్ధవిమానాలు కొనుగోలు చేయడంతోపాటు స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్డీవో కూడా ఆయుధాలు రూపొందిస్తోంది. తాజాగా ఎలుకలు(రాట్స్)ను సరికొత్త ఆయుధాలను డీఆర్డీవో త్వరలో అందుబాటులోకి తేబోతోంది.

చైనా, పాకిస్తాన్ వెన్నులో వణుకు..
గతంలో డీఆర్డీఓ రూపొందించిన డ్రోన్ మన దాయాది దేశం పాకిస్తాన్‌లో రహస్యాలు తెలుసుకునేందుకు ఎంతో ఉపయోగపడింది. కేంద్ర ప్రభుత్వ సహాదారుగా ఉన్న ధోవల్ గతంలో డీఆర్డీవో తయారు చేసిన పక్షిలాంటి డ్రోన్ ద్వారా పాకిస్తాన్‌కు వెళ్లి అక్కడి సైనిక రహస్యాలు తెలుసుకున్నారు. మారువేశంలో పాకిస్తాన్‌లో నెలల తరబడి ఉన్నారు. తీవ్రవాద సంస్థలను గుర్తించారు. ఇలాంటి సాంకేతికతను దేశీయంగా రూపొందించిన డీఆర్డీఏ ఇప్పుడు ఎలుకలను ఆయుధాలుగా మార్చుతోంది.
ఏడాదిన్నర క్రితం శ్రీకారం..
ఎలుకలను సైన్యానికి ఆయుధాలుగా మార్చే పనికి డీఆర్డీవో ఏడాదిన్నర క్రితం శ్రీకారం చుట్టింది. రిమోట్ ద్వారా నడిచేలా ఎలుకలకు శిక్షణ ఇస్తోంది. సైనికులు జంతువులను ఉపయోగించడం కొత్తేమీ కాదు. కానీ, ఎలుకలను ఇందుకు ఉపయోగించడం ఇదే మొదటి సారి. గతంలో పావురాలు, గద్దలను వినియోగించారు. ఇప్పుడు ఎలుకలను యానిమల్ సైబర్గ్‌గా పిలుస్తున్నారు. దీనిపై ఇటీవల నిర్వహించిన 151వ జాతీయ సైన్స్ సెమినార్‌లో దీనిపై డీఆర్డీవో శాస్త్రవేత్త ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. వీటిని శత్రుదేశాల్లోకి పంపడం ద్వారా అక్కడి రహస్యాలు తెలుసుకుని మన సైనిక వ్యూహాలు రూపొందించుకోవచ్చని తెలిపారు. పూర్తిగా రిమోట్ ద్వారా ఈ యానిమల్ సైబర్గ్ పనిచేస్తాయని వెల్లడించారు.

సామర్థ్యం పెంచడం ద్వారా..
సాధారణ ఎలుకల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వాటిని యానిమల్ సైబర్గ్స్‌గా మారుస్తారు. ఇవి సాధారణ ఎలుకలకంటే శక్తివంతంగా మారుతాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు అమర్చడం ద్వారా రిమోట్ కంట్రోల్‌తో పనిచేస్తాయి. సైనిక రహస్యాలు తెలుసుకోవడంతోపాటు తుపానులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా వీటిద్వారా ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టవచ్చని డీఆర్డీవో పేర్కొంది. అన్నీ అనుకున్నట్లు జరగితే ఈ ఏడాది సైన్యం చేతికి ఈ యానిమల్ సైబర్గ్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.