Heroes First Jobs: ఈ స్టార్లు సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఏం చేశారో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో స్టార్లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. కానీ సినీ పరిశ్రమలో చాలా మంది ఎలాంటి background లేకుండానే entry ఇచ్చి తమకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు.

Written By: Suresh, Updated On : September 30, 2023 4:23 pm

Heroes First Jobs

Follow us on

Heroes First Jobs: గోల్డెన్ స్పూన్ తో ప్రతి ఒక్కరు పుట్టలేరు. కానీ చాలా మందికి కోరికలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. వాటిని తీర్చుకోవడం కోసం నానా తంటాలు పడుతుంటారు. ఇక సినిమా అంటే పిచ్చితో ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటారు. కానీ అందరికీ ఈ ఛాన్స్ దొరకడం కష్టమే ఫ్రెండ్స్. అయినా మీలో కూడా కొందరు ఈ సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటారు. కానీ సాధ్యం అవుతుదా? అయితే సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఇంట్లో ఉంటే.. వారసత్వంలాగా సినిమా ఇండస్ట్రీ లోకి కూడా ఎంట్రీ ఇవ్వడం సులభమే అవుతుంది.

ఇంట్లో సినిమా ఫీల్డ్ లో ఉండే నటులు ఉంటే.. బాలనటులుగా ఎంట్రీ ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే కొన్ని రోజుల పాటు ఇతర కంపెనీలో పని చేసి, ఉద్యోగాలు చేసి, వ్యాపారాలు మానేసి మరీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వారుంటారు. అయితే సినీ ఇండస్ట్రీకి రాకముందు బాలీవుడ్ స్టార్లు కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ లిస్ట్ లో షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ హీరోలు కూడా ఉన్నారు. ఇక ఇండస్ట్రీలోకి రావడం అంత ఈజీ కాదు అనే విషయం తెలిసిందే. అయినా కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా..అనేక కష్టాలు పడుతూ చివరకు స్టార్ హీరోలుగా మారారు. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సినిమా ఇండస్ట్రీలో స్టార్లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. కానీ సినీ పరిశ్రమలో చాలా మంది ఎలాంటి background లేకుండానే entry ఇచ్చి తమకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. విజయ్ సేతుపతికి పాన్ ఇండియా స్థాయిలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవల విడుదలైన జవాన్ సినిమాతో తమిళం, హిందీ, తెలుగులో భారీ విజయాన్ని అందుకున్నారు. అయితే విజయ్ సినిమాల్లోకి రాకముందు దుబాయ్‌లో అకౌంటెంట్‌గా పనిచేశారు. 10 లక్షల రూపాయల అప్పు తీర్చేందుకు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత స్టార్ ఆర్టిస్టుగా ఎదిగాడు.

అక్షయ్ కుమార్.. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కేవలం బాలీవుడ్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. అంత గొప్ప స్థానానికి చేరుకోవడానికి అక్షయ్ కుమార్ చాలా కష్టపడ్డాడు. అయితే ఇండస్ట్రీలోకి రాకముందు అక్షయ్ కుమార్ వెయిటర్ గా పనిచేశాడట. అయితే బ్యాంకాక్ ఫుడ్ స్టాల్ లో పనిచేశాడు. మోడలింగ్ లో తన సత్తా చాటాడు. దర్శకుడు ప్రమోద్ చక్రవర్తి తెరకెక్కించిన దీదార్ లో హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా 1992లో విడుదలైంది. ఈ సినిమాకంటే ముందు అక్షయ్ కుమార్ అనేక చిత్రాలలో కనిపించాడు.

కేజీఎఫ్ 2′ సినిమా ద్వారా యష్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ తర్వాత ఆయన కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు. అయినా యశ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యష్ మొదట్లో తెరవెనుక పనిచేశాడు. అతని తండ్రి బస్ డ్రైవర్. యష్ మొదట బుల్లితెరపై అడుగుపెట్టాడు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఓ వెలుగు వెలిగారు.

షారుఖ్ ఖాన్.. షారుఖ్ అంటే తెలియని వారుండరు. అమ్మాయిలను మీ డ్రీమ్ బాయ్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు షారుఖ్ ఖాన్. ఈ మధ్య ఏమైందో కానీ.. షారుఖ్ సినిమాల్లో కనిపించలేదు. అలా నాలుగేళ్ల తర్వాత పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ స్టార్ హీరో కూడా ఇండస్ట్రీలోకి రాకముందు టికెట్స్ సేల్స్ మెన్ గా పనిచేశాడని టాక్.. ఆ సమయంలో ఆయన జీతం. రూ. 50 మాత్రమే తీసుకునేవారట.అయితే ఈయన ఎన్నో ఏళ్ల కృషి తర్వాత ఆయనకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది మాత్రం హేమమాలిని. ఆమె డైరెక్షన్ చేసిన దిల్ ఆశ్నా హై సినిమా.. కొన్ని కారణాల వల్ల రిలీజ్ లేటయింది. సెకండ్ ఛాన్స్ గా దీవానా లో ఆఫర్ వచ్చింది. రిషికపూర్, దివ్యభారతిలతో పాటు సపోర్టింగ్ రోల్ అది. ఆ సినిమాతోనే షారుఖ్ లైఫ్ టర్న్ అయింది.

రజినీకాంత్..సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ హీరో అభిమానులు ఫుల్ అనే చెప్పాలి. ఈయన కూడా ఎన్నో కష్టాలు పడిన తర్వాతనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈయన సినిమాలోకి రాకముందు బస్సు కండక్టర్ గా పనిచేసేవారట.

అమితాబ్ బచ్చన్.. బాలీవుడ్ కింగ్, బాలీవుడ్ మెగాస్టర్ అంటే అమితాబ్ బచ్చన్ పేరు చెప్తారు. దాదాపు 50 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు ఆయన. ఇప్పటికి అమితాబ్ బచ్చన్ సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూడడం విశేషం. ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందు కోల్ కతాలోని ఒక షిపింగ్ కంపెనీలో పనిచేసారని సామాచారం. ఈయన నిర్మాత కూడా. టెలివిజన్ హోస్ట్ గా, హిందీ చిత్రాలలో పని చేసే మాజీ రాజకీయ నాయకుడు కూడా. అతను 1969లో సాత్ హిందూస్తానీతో నటుడిగా అరంగేట్రం చేశాడు. అంతేకాదు మొదట్లోనే మృణాల్ సేన్ భువన్ షోమ్ కి కథ అందించారు.