Congress : కాంగ్రెస్ ఉత్తర – దక్షిణ భారత గొడవ సృష్టిస్తే దానికే నష్టం

దక్షిణాదిన కాంగ్రెస్ బలంగా ఉంది. అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. సో ఇప్పుడు దక్షిణ భారత్ కు అన్యాయంపై గొడవ లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ ఉత్తర - దక్షిణ భారత గొడవ సృష్టిస్తే దానికే నష్టం అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : December 4, 2023 5:02 pm

Congress : సేనాని ఎప్పుడూ ముందుండి నడిపించాలి. మోడీ నిజమైన సేనాని.. అదే చేశాడు ఇప్పుడు ఎన్నికల్లో.. ఎందుకంటే మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత వచ్చింది. సీఎం ఎవరన్నది చెప్పకుండా ప్రచారం చేశారు. రాజస్థాన్, చత్తీస్ ఘడ్ లో వారి ప్రభుత్వం లేదు. ఇక్కడ సీఎంలను ఎవరు చేస్తామన్నది చెప్పకుండా ప్రచారం చేశారు.

ఇచ్చిందల్లా మోడీ గ్యారెంటీ.. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఏ హామీలు అయితే చేస్తున్నానో వాటిని అమలు చేసే బాధ్యత నాది అంటూ.. మోడీ గ్యారెంటీ అంటూ హామీ ఇచ్చారు. ముందుండి నడిపించాడు. ఈ ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఫెయిల్ అయ్యింటే అందరూ మోడీనే టార్గెట్ చేసేవారు. బీజేపీ ఓటమికి మోడీని తిట్టిపోసేవారు. అంతటి రిస్క్ తీసుకున్నాడు మోడీ.

ఏ సీఎంలను మూడు రాష్ట్రాల్లో ప్రకటించకుండా ఎన్నికలకు వెళ్లాడు. జనం మాత్రం మోడీ ‘గ్యారెంటీ’కే ఓటు వేశాడు. అది మోడీ మీద ఉన్న నమ్మకం. హిందీ బెల్ట్ లో బీజేపీకి ఎదురులేదని మరోసారి నిరూపితమైంది. దీన్ని బట్టి 400 ఎంపీ సీట్లు బీజేపీకి సాధ్యమేనని తెలుస్తోంది.

దక్షిణాదిన కాంగ్రెస్ బలంగా ఉంది. అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. సో ఇప్పుడు దక్షిణ భారత్ కు అన్యాయంపై గొడవ లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది.

కాంగ్రెస్ ఉత్తర – దక్షిణ భారత గొడవ సృష్టిస్తే దానికే నష్టం అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.