HomeజాతీయంCongress vs Modi : మోదీ నచ్చడు కాబట్టి పాకిస్థాన్ ను ప్రేమించాలా?: ఇది కాంగ్రెస్...

Congress vs Modi : మోదీ నచ్చడు కాబట్టి పాకిస్థాన్ ను ప్రేమించాలా?: ఇది కాంగ్రెస్ నిజస్వరూపం

Congress vs Modi : మన దేశానికి దీర్ఘకాల శత్రువు ఎవరు? పోనీ దేశం సంవత్సరాలుగా పోరాడుతున్నది ఎవరితో? కార్గిల్ లాంటి యుద్ధాలు జరిగింది ఎవరితో? వందలాది మంది సైనికులు ఎందువల్ల ప్రాణాలు కోల్పోయారు? పఠాన్ కోట్ వంటి ఘటనలు ఎందుకు జరిగాయి? పుంచ్ సెక్టార్ లో ఎందుకు పేలుళ్లు జరిగాయి? ఇన్ని ప్రశ్నలకు ఒకే ఒక సమాధానం పాకిస్తాన్. అది మన దేశాన్ని నాశనం చేసేందుకు ఎవరితో అయినా చేతులు కలుపుతుంది. చివరికి ఐసిస్ లాంటి ప్రమాదకర ఉగ్రవాద సంస్థలతోనూ ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఐ ఎస్ ఐ లాంటి సంస్థలు మనదేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు పన్నాగాలు పన్నుతాయి. అలాంటి శత్రు దేశాన్ని ఎవరైనా ప్రేమిస్తారా? పోనీ ఆ దేశాన్ని మేము ప్రేమిస్తాం మీకొచ్చే ఇబ్బంది ఏంటని? ఎదురు ప్రశ్నిస్తారా? అలాగే వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.

కాంగ్రెస్ నాయకుల వల్లే..

నాడు మతప్రాతిపదికన దేశాన్ని విభజించడం వల్లే ఈరోజు భారత్ అనేకసార్లు మూల్యాలు చెల్లించుకోవాల్సి వస్తోంది. పాకిస్తాన్ పూర్తి ఉగ్రవాద దేశంగా మారిపోవడం, కాశ్మీర్ కోసం రక్తపాతం సృష్టించడం వల్ల మన దేశం సైన్యం కోసం అధిక మొత్తంలో వెచ్చించాల్సి వస్తోంది. డబ్బు సంగతి పక్కన పెడితే వేలాదిమంది సైనికులను కోల్పోవాల్సి వస్తోంది. ఇంతటి దారుణం జరుగుతుంటే కనీస సోయిలేని కాంగ్రెస్ నాయకులు ప్రధానమంత్రి మీద కోపంతో పాకిస్థాన్ ను ప్రేమిస్తామని చెబుతున్నారు. వేలాది మంది చూసే న్యూస్ ఛానల్స్ డిబేట్లో పాకిస్తాన్ దేశాన్ని ప్రేమిస్తాం.. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి పాకిస్తాన్ మన దేశం మీద అల అక్కసు పెంచుకోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ నాయకులే. నాడు మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో దేశాన్ని మత ప్రాతిపదికన విభజించకుండా ఉండి ఉంటే ఇవాళ ఇంతటి ఉత్పాతం జరిగి ఉండేది కాదు.

లాల్ చౌక్ లో మొన్న ఎగిరింది

ఇక కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ దేశానికి అనుకూలంగా మాట్లాడుతుంటే.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మాత్రం పాకిస్తాన్ పీచం అణిచేందుకు చేయాల్సిన ప్రయత్నం చేస్తోంది. భారత్ గట్టి చర్యలు తీసుకోవడం వల్ల పాకిస్తాన్ ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. ఇదే అదునుగా సున్నితమైన ప్రాంతాల్లో భారత బలగాలను మోహరించింది. కాశ్మీర్లో ఆర్టికల్ 370 ను రద్దు చేసింది. ఒకే దేశంలో ఒకే రాజ్యాంగం అమలు కావాలని స్పష్టం చేసింది. ఫలితంగా లాల్ చౌక్ లాంటి ఏరియాలో పాకిస్తాన్ జెండాకు బదులు భారత జెండా ఎగురుతోంది. అసలు ఉపాధి లేని కాశ్మీరీ యువకులకు కార్పొరేట్ కంపెనీలు కొలువులు ఇస్తున్నాయి. అటల్ టన్నెల్ లాంటి నిర్మాణాలు రూపు దిద్దుకుంటున్నాయి. లడక్ లాంటి ప్రాంతాలకు అధునాతనమైన రహదారులు నిర్మితమవుతున్నాయి. వైష్ణో దేవి ఆలయాన్ని కోటి మంది భక్తులు దర్శించుకునే వెసలు బాట్లు దక్కుతున్నాయి. కాశ్మీర్ రాష్ట్రాన్ని దేశంలో ఒక అంతర్భాగంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. దానిని సమర్థించాల్సింది పోయి పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేయడం కాంగ్రెస్ నాయకులకే చెల్లింది.

కర్ణాటకలో గెలవగానే

కాంగ్రెస్ నాయకులు కేవలం ఆవేశంలోనే అలాంటి వ్యాఖ్యలు చేశారనుకుంటే పొరబాటే. ఎందుకంటే కర్ణాటక రాష్ట్రంలో విజయం సాధించిన అనంతరం అక్కడికి కోస్తా ప్రాంతమైన మంగళూరులో పాకిస్తాన్ జెండాలు ఎగిరాయి. పాకిస్తాన్ అనుకూల నినాదాలు సోషల్ మీడియాలో హోరెత్తాయి. కేవలం కాంగ్రెస్ నాయకులు మాత్రమే కాదు భారత రాష్ట్ర సమితి నాయకుల ధోరణి కూడా ఇలానే ఉంటుంది. ఆదిలాబాద్ లోని నిర్మల్ జిల్లాలో భైంసా పట్టణంలో గత ఏడాది సంక్రాంతి సందర్భంగా జరిగిన ఉత్పతాన్ని మనం చూసాం. అప్పట్లో ప్రభుత్వం రెండు వర్గాల మధ్య కొట్లాటగా మాత్రమే చూపించింది. కానీ వాస్తవ పరిస్థితి వేరు. ఇప్పటికీ అక్కడ పాకిస్తాన్ అనుకూల రాతలు గోడల మీద కనిపిస్తూనే ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే శక్తులు పొరుగున లేవు. ఇంట్లోనే ఉన్నాయి. వాటిని తుద ముట్టిస్తేనే ఈ దేశానికి శత్రు పీడ కొంతలో కొంతైనా తగ్గుతుంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version